ED MLC Kavitha : రాలేనన్న కవిత కుదరదన్న ఈడీ
న్యూఢిల్లీలో బిగ్ ట్విస్ట్ ..అంతటా ఉత్కంఠ
ED Serious Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఉదయం 11 గంటలకు వెళ్లాల్సి ఉండగా తాను రాలేనంటూ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను అనారోగ్యానికి గురైనట్లు అందుకే రావడం లేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా ఈడీకి సమాచారం పంపింది.
ఇదే సమయంలో ప్రముఖ లాయర్ , ఆప్ ఎమ్మెల్యే సోము భరత్ తో పాటు న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. యావత్ కేబినెట్ తో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో తిష్ట వేశారు. సోము భరత్ ఈడీ ఆఫీసుకు వెళ్లారు సమాచారం అందించారు. దీనిపై ఈడీ స్పందించింది. తాము ఒప్పుకునేది లేదంటూ స్పష్టం(ED Serious Kavitha) చేసింది. మరో తేదీన తాను విచారణకు హాజరవుతానని స్పష్టం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
తనకు స్టే ఇవ్వాలని కోరుతూ అభ్యర్థించింది. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించింది కల్వకుంట్ల కవిత. ఈ తరుణంలో భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం ధర్మాసనం ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఉన్నట్టుండి ట్విస్ట్ చోటు చేసుకోవడం విస్తు పోయేలా చేసింది. ఇదంతా డ్రామా అని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఇక కేసుకు సంబంధించి అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ ముగిసింది. ఆడిటర్ బుచ్చిబాబుతో కలిసి విచారించాల్సి ఉండగా ఉన్నట్టుండి ఈడీకి షాక్ ఇచ్చింది కవిత.
Also Read : ఈడీ విచారణకు కవిత డుమ్మా