ED Issues Kavitha : 20న ఎమ్మెల్సీ క‌విత రావాల్సిందే

స్ప‌ష్టం చేసిన ద‌ర్యాప్తు సంస్థ ఈడీ

ED Issues Kavitha : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంకు సంబంధించి రోజు రోజుకు ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. మార్చి 16న గురువారం ఈడీ ముందు ఉద‌యం 11 గంట‌ల‌కు ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంది. కానీ క‌విత చాలా తెలివిగా స్కెచ్ వేసింది. తాను అనారోగ్యానికి గురైన‌ట్లు అందుకే విచార‌ణకు హాజ‌రు కాలేక పోతున్న‌ట్లు తెలిపింది.

ఆమె త‌ర‌పున న్యాయ‌వాది సామ భ‌ర‌త్ క‌విత(Kavitha) త‌ర‌పున ఈడీ ఆఫీసుకు వెళ్లారు. తాను హాజ‌రు కాలేదంటూ లేఖ ఇచ్చారు. ఈడీ త‌ర‌పున 11 పేజీల ఆధారాలు స‌మ‌ర్పించారు. తాను కేసుకు సంబంధించి వెసులుబాటు ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశాన‌ని, మార్చి 24న విచార‌ణ చేప‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు.

ఒక ర‌కంగా ఎమ్మెల్సీ క‌విత‌కు బిగ్ షాక్ ఇచ్చింది. నిన్న రౌండ్ టేబుల్ స‌మావేశం చేప‌ట్టంది క‌విత‌. మ‌రో వైపు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లారు. అక్క‌డ న్యాయ‌వాదులు, నిపుణుల‌తో తీవ్రంగా చ‌ర్చించారు. తన‌ను అరెస్ట్ చేస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలా ఉండ‌గా మొత్తం హైద‌రాబాద్ నుంచి సీఎం కేసీఆర్ చ‌క్రం తిప్పుతున్నారు. సుప్రీంకోర్టు 24 న తీర్పు త‌ర్వాత వ‌స్తాన‌ని పేర్కొంది ఈడీకి రాసిన లేఖ‌లో క‌విత‌. దీనిపై ఒప్పుకోలేదు ఈడీ. మార్చి 20న క‌విత రావాల్సిందేనంటూ స్ప‌ష్టం(ED Issues Kavitha) చేసింది. ఈ లిక్క‌ర్ స్కాం కేసుకు సంబంధించి ఆడిట‌ర్ బుచ్చిబాబు, వ్యాపార వేత్త అరుణ్ రామ‌చంద్ర పిళ్లై ని ఇవాళ విచారించింది.

Also Read : ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత‌కు ఊర‌ట

Leave A Reply

Your Email Id will not be published!