Sonia Gandhi ED : సోనియా గాంధీని ప్ర‌శ్నిస్తున్న ఈడీ

త‌ల్లి కోసం నిరీక్షిస్తున్న ప్రియాంక గాంధీ

Sonia Gandhi ED : నేష‌న‌ల్ హెరాల్డ్ ప‌త్రిక‌లో మ‌నీ లాండ‌రింగ్ కేసుకు సంబంధించి గురువారం ఆల్ ఇండియా క్రాంగెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ ముందుకు హాజ‌ర‌య్యారు.

పార్టీ కార్యాల‌యం నుంచి బ‌య‌లు దేరుతుండ‌గా పెద్ద ఎత్తున పోలీసులు మోహ‌రించారు. ఆమెను ప్ర‌శ్నించ‌డాన్ని నిర‌సిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కులు, శ్రేణులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు.

దీంతో ఈడీ కార్యాల‌యం చుట్టు గ‌ట్టి భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ(Sonia Gandhi)  త‌న జెడ్ + కేట‌గిరీ ఎస్కార్ట్ తో మ‌ధ్యాహ్నం త‌ర్వాత కొద్ది సేప‌టికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్(ED) కార్యాల‌యానికి చేరుకున్నారు.

పార్ల‌మెంట్ లో సైతం స‌భ్యులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో కీల‌క‌మైన స‌మావేశం జ‌రిగింది. ఇందులో 13 పార్టీలకు చెందిన నాయ‌కులు పాల్గొన్నారు.

సోనియా గాంధీని ఈడీ ప్ర‌శ్నించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. కోవిడ్ తో బాధ ప‌డుతున్న సోనియా గాంధీ ముసుగు ధ‌రించి ఉన్నారు. ఆమె వెంట కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ఉన్నారు.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ అనుస‌రిస్తున్న తీరుపై, కేంద్ర స‌ర్కార్ ధోరణిపై తీవ్రంగా ఆక్షేప‌ణ తెలిపింది కాంగ్రెస్ పార్టీ. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి 75 ఏళ్ల వ‌య‌స్సు.

ఈ స‌మ‌యంలో ఎలా విచార‌ణ‌కు పిలుస్తారంటూ పార్టీ ప్ర‌శ్నించింది. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబానికి జేబు సంస్థ‌గా మారి పోయింద‌ని ఎద్దేవా చేసింది భార‌తీయ జ‌న‌తా పార్టీ.

Also Read : కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో పార్టీల కీల‌క భేటీ

Leave A Reply

Your Email Id will not be published!