MLC Kavitha ED : కొనసాగుతున్న కవిత విచారణ
బోయినపల్లికి బెయిల్ నిరాకరణ
MLC Kavitha ED Continues : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఆమె భర్తను కూడా లోపలికి రానీయలేదు. వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్లను కూడా పక్కన పెట్టారు. వంద మీటర్ల దూరంలో మంత్రులు, అనుచరులను ఉంచారు. పరిసర ప్రాంతాలన్నీ నిర్మానుశ్యంగా ఉంచేలా చేశారు.
ఈ తరుణంలో ప్రధానంగా లిక్కర్ దందాలో రూ. 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. అవి ఎవరి ద్వారా అందాయి. సౌత్ గ్రూప్ ఏమిటి. దాని వెనుక మతలబు ఏమిటి. అభిషేక్ నాయర్, ఆడిటర్ బుచ్చిబాబు, రామచంద్రన్ పిళ్లై , మాగుంట కొడుకు, అభిషేక్ బోయినపల్లి, సమీర్ నాయర్..ఇలా ప్రతి ఒక్కరితో ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha ED Continues) ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్లు సమాచారం.
జరిగిన లావాదేవీలు , ఎవరెవరు డబ్బులు సమకూర్చారంటూ ప్రశ్నిస్తున్నట్లు టాక్. అసలు మీరెందుకు ఇందులో తల దూర్చారు. హోటల్ లో ఎందుకు కలివారు. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఎలా సంపాదిస్తే ఇంతలా వచ్చాయి. దీనికి ఏమైనా లెక్కలు ఉన్నాయా అని ప్రశ్నల వర్షం కురిపించినట్లు టాక్.
మరో వైపు ఇదే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఆప్ అగ్ర నాయకుడు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది ఈడీ. తీహార్ జైలులో ఉన్నాడు. తాజాగా జరుగుతున్న విచారణలో ఎమ్మెల్సీ కవితతో పాటు ఆడిటర్ బుచ్చిబాబు, రామచంద్రన్ పిళ్లై , మనీష్ సిసోడియాను కలిపి విచారిస్తున్నట్లు టాక్. ఇది నిజమా కాదా అనేది సాయంత్రం దాకా వేచి చూస్తూనే కానీ తెలియదు.
Also Read : ఉత్కంఠకు తెర దించిన కవిత