ED Raids Gayatri Ravi : టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవికి షాక్
పలు చోట్ల ఈడీ, ఐటీ దాడులు..సోదాలు
ED Raids Gayatri Ravi : మునుగోడు ఉప ఎన్నిక ముగిశాక కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణను జల్లెడ పట్టే పనిలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) లు సంయుక్తంగా రంగంలోకి దిగాయి.
గ్రానైట్, మైనింగ్ వ్యవహారాలకు సంబంధించి నిన్న టీఆర్ఎస్ కు చెందిన మంత్రి గంగుల కమలాకర్, ఆయన బంధువుల ఇళ్లలో ఏక కాలంలో హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో దాడులు చేపట్టింది.
ఈ తరుణంలో గురువారం ఇదే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన ఎంపీ గాయత్రి రవికి(ED Raids Gayatri Ravi) బిగ్ షాక్ ఇచ్చాయి ఈడీ, ఐటీ. ఆయన కార్యాలయంపై దాడులు చేపట్టాయి. విస్తృతంగా సోదాలు చేపట్టారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో గల ఎంపీ గాయత్రి రవి ఆఫీసులో 11 గంటలుగా సోదాలు చేపట్టారు.
హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లో కూడా సోదాలు నిర్వహిస్తూ వచ్చారు. దీంతో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది. రాష్ట్రానికి సంబంధించి మైనింగ్ వ్యవహారంలో చోటు చేసుకున్న లావాదేవీల గురించి ఈడీ, ఐటీ వేగం పెంచింది.
ఇక మంత్రి గంగుల కమలాకర్ దుబాయ్ నుంచి హుటా హుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన ఇంటి తాళాన్ని పగులగొట్టి సోదాలు చేపట్టారు. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జల్లెడ పడుతున్నారు. ప్రముఖులు, వ్యాపారవేత్తల ఇళ్లను టార్గెట్ చేశారు.
ఇప్పటికే ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డితో పాటు మరో వ్యాపారవేత్త వినయ్ బాబును అరెస్ట్ చేయడం కలకలం రేపింది. రేపో మాపో సీఎం కూతురుకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు టాక్.
Also Read : మెయిన్ పురి బరిలో డింపుల్ యాదవ్