Sonia Gandhi : సోనియా గాంధీకి ఈడీ సమన్లు
ఈనెల 21న హాజరు కావాలని ఆదేశం
Sonia Gandhi : ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి(Sonia Gandhi) మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 21న తమ ముందు హాజరు కావాలంటూ జారీ చేసిన సమన్లలో పేర్కొంది.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి కూడా నోటీసులు జారీ చేసింది.
తల్లీ, కొడుకుకు నోటీసులకు సంబంధించి ఐదు రోజుల పాటు ఈడీ ముందు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ఇదిలా ఉండగా సోనియా గాంధీకి మరోసారి కరోనా సోకింది. దీంతో ఆమె వారం రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందారు.
అంతకు ముందు ఈడీకి తాను చికిత్సలో ఉన్నానని , వైద్యుల సూచనలతో తాను ఆరోగ్యం కుదుట పడిన తర్వాత హాజరవుతానని సమాధానం ఇచ్చారు. తాను, తన తనయుడు ఎలాంటి తప్పు చేయలేదని తప్పక హాజరవుతామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే రెండు సార్లు ఈడీ సోనియా గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఆరోగ్యం కారణంగా వెసులు బాటు ఇచ్చింది ఏఐసీసీ చీఫ్ కు. తనకు మరికొంత సమయం కావాలని కోరడం, అందుకు ఈడీ ఒప్పుకోవడం జరిగింది.
కానీ ఇచ్చిన గడువు పూర్తి కావడంతో మరోసారి ఈడీ రంగంలోకి దిగింది. తమ వద్దకు 21న విధిగా హాజరు కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా నేషనల్ హెరాల్డ్ పత్రికలో కోట్లు చేతులు మారాయని, దీనికి లెక్కా పత్రం లేదంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎంపీ , ప్రముఖ న్యాయవాది సుబ్రమణ్య స్వామి సీబీఐకి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కాంగ్రెస్ హయాంలో ఈ కేసును క్లోజ్ చేశారు. తిరిగి తెరిచారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇది కక్ష సాధింపు తప్ప మరొకటి కాదని ఆరోపించింది.
Also Read : జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన మోదీ