MLC Kavitha Lawyer : కవితపై ఈడీ విచారణ చట్ట విరుద్దం
మహిళ హక్కులకు భంగం
MLC Kavitha Lawyer : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఉన్నట్టుండి గురువారం విచారణకు హాజరు కాలేదు. మార్చి 11న విచారణకు హాజరు అయ్యారు. 9 గంటల పాటు ఈడీ విచారించింది. ఇవాళ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కవిత తరపు న్యాయవాది సోమా భరత్(MLC Kavitha Lawyer) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కవితపై ఈడీ విచారణ సరిగా సాగడం లేదన్నారు.
కేంద్రం కుట్రలో భాగంగా ఎమ్మెల్సీ కవితను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. మహిళలను ఇంటి వద్దనే విచారించాలని , సాయంత్రం 6 గంటల లోపే ఉంచాలని , ఇది భారత చట్టంలో ఉందని పేర్కొన్నారు. 11న జరిగిన విచారణలో ఈ చట్టాలను పట్టించు కలేదని ఆరోపించారు న్యాయవాది సోమా భరత్.
ఉదయం 11 గంటలకు విచారణకు రావాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా వెళ్లడం లేదని స్పష్టం చేశారు . ఇప్పటికే కేసు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోందని , 24న విచారణ జరగనుందని ఆ తర్వాతే తాము ఈడీ ముందు విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు సామ భరత్(MLC Kavitha Lawyer). ఇదే సమయంలో 12 డాక్యుమెంట్లు సమర్పించినట్లు చెప్పారు.
అయితే చట్ట ప్రకారం కవిత విచారణ సరిగా జరగడం లేదని ఆరోపించారు. అక్రమంగా కవిత ఫోన్ ను ఈడీ సీజ్ చేసిందని మండిపడ్డారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని , ఇచ్చే తీర్పు ప్రకారం నడుచుకుంటామని తెలిపారు సామ భరత్.
ఆఫీసుకు స్వయంగా మహిళలను రావాలని సమన్లు ఇచ్చే పవర్స్ ఈడీకి లేదని స్పష్టం చేశారు సామ భరత్. మొత్తంగా కావాలని వేధింపులకు గురి చేయడం పనిగా పెట్టుకుందన్నారు.
Also Read : ఈడీ విచారణకు కవిత డుమ్మా