Ee Raathale Song : మ‌న‌సు దోచేస్తున్న రాధే శ్యాం సాంగ్

కొత్త లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేసిన మేక‌ర్స్

Ee Raathale Song : పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్ర‌భాస్, ల‌వ్లీ బ్యూటీ పూజా హెగ్డే క‌లిసి న‌టించిన రాధే శ్యామ్ విడుద‌లకు రెడీ అవుతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్స్ , ట్రైల‌ర్, పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీకి జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా ప‌లువురు సంగీత ద‌ర్శ‌కులు ఈ చిత్రానికి ప‌ని చేయ‌డం విశేషం. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే నెల మార్చి 11న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేశారు.

వాస్త‌వానికి ఈ సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి మ‌రింత పెర‌గ‌డంతో సినిమాను కొంచెం ముందుకు జ‌రిపారు. రాధే శ్యామ్ ను ప్ర‌తిష్టాత్మ‌కంగా సెల్యూలాడ్ మీద కావ్యంగా మలిచాడు ద‌ర్శ‌కుడు.

నాలుగు ఏళ్లు క‌ష్ట‌ప‌డి త‌యారు చేసిన క‌థ ఇది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడే చెప్పాడు. చాలా టైం తీసుకున్నా ప్ర‌భాస్ సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో 90 శాతానికి పైగా టికెట్లు అమ్ముడు పోవ‌డం ఒకింత విస్తు పోయేలా చేసింది. రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు ప‌ర‌మ‌హంస అనే ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టిస్తున్నారు.

కాగా మూవీకి సంబంధించి ప్ర‌మోష‌న్స్ స‌క్ర‌మంగా చేప‌ట్ట లేద‌న్న అప‌వాదు ఎదుర్కొన్నారు మూవీ మేక‌ర్స్ . తాజాగా స‌రికొత్త లిరిక‌ల్ సాంగ్ ను ఇవాళ విడుద‌ల చేశారు.

ఈ రాత‌లే అనే పాట (Ee Raathale Song)ఆక‌ట్టుకునేలా ఉంది. ప్ర‌స్తుతం ఈ పాట వైర‌ల్ గా మారింది. కృష్ణ కాంత్ రాస్తే యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించారు. హ‌రిణి ఇవ‌టూరి ఈ సాంగ్ పాడారు.

ఇందులో పూజా హెగ్డే మ‌రింత అందంగా క‌నిపిస్తుండ‌డంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ముచ్చ‌ట ప‌డి పోతున్నారు.

Also Read : మీ అభిమానం గుండెల్లో ప‌దిలం

Leave A Reply

Your Email Id will not be published!