Eknath Shinde MLA’s : ఇదిగో శివ‌సేన ఎమ్మెల్యేల బ‌లగం

ఉద్ద‌వ్ కు ఏక్ నాథ్ షిండే స‌వాల్

Eknath Shinde MLA’s : మ‌రాఠా రాజ‌కీయాలు మ‌రింత అగ్గిని రాజేస్తున్నాయి. కేంద్రం పెట్టిన చిచ్చు వ‌ల్లే ఇదంతా అంటూ శివ‌సేన జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్ ఆరోపించారు.

ఇదే స‌మ‌యంలో తాము బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం అంటూ ఉండ‌ద‌ని కానీ బీజేపీనే శివ‌సేన పార్టీతో విలీనం కావాల‌ని ష‌ర‌తు పెట్టారు.

ఏక్ నాథ్ షిండే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు బ‌య‌ట‌కు రాలేక పోతున్నార‌ని, వారిని బ‌ల‌వంతంగా నిర్భంధించారంటూ మండిప‌డ్డారు రౌత్.

ఇదిలా ఉండ‌గా త‌న‌కు త‌న‌కు 41 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉందంటూ ప్ర‌క‌టించారు రెబ‌ల్ నాయ‌కుడు ఏక్ నాథ్ షిండే(Eknath Shinde MLA’s).

ఇదే స‌మ‌యంలో శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస సంయుక్తంగా క‌లిసి ఏర్పాటు చేసిన మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వం మైనార్టీలోకి ప‌డి పోయింది.

ఈ త‌రుణంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల్సిన గ‌వ‌ర్న‌ర్ క‌రోనా కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరారు. త‌మ‌ను గుర్తించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చాన్స్ ఇవ్వాలంటూ అస్సాంలోని గౌహ‌తి హోట‌ల్ నుండే లేఖ పంపించారు.

ఆ లేఖ‌ను డిప్యూటీ స్పీక‌ర్ కు కూడా అందించారు. ఇదే స‌మ‌యంలో శివ‌సేన పార్టీ చీఫ్ విప్ గా ఉన్న ఏక్ నాథ్ షిండేను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే.

ఆయ‌న బుధ‌వారం అర్ధ‌రాత్రే ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుండి ఖాళీ చేశారు. ప్ర‌స్తుతం మ‌రాఠాలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో త‌న వ‌ద్ద ప‌దే ప‌దే ఎమ్మెల్యేలు లేరంటూ ప్ర‌క‌టించడాన్ని త‌ప్పు ప‌ట్టారు ఏక్ నాథ్ షిండే. ఇదిగో సాక్ష్యం అంటూ ఎమ్మెల్యేల‌తో(Eknath Shinde MLA’s) క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది.

Also Read : ప్ర‌భుత్వాల‌ను కూల్చే వాళ్ల‌కు వ‌ర‌ద‌లు ప‌ట్ట‌వు

Leave A Reply

Your Email Id will not be published!