Eknath Shinde : మాదే అస‌లైన శివ‌సేన – షిండే

ఎన్నిక‌ల క‌మిష‌న్ కు లేఖ

Eknath Shinde : శివ‌సేన తిరుగుబాటు నేత‌, మ‌హారాష్ట్ర బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌దే అస‌లైన శివ‌సేన పార్టీ అని పేర్కొన్నారు.

అత్య‌ధిక శాతం ఎమ్మెల్యేలు , 12 మంది ఎంపీలు తన‌కే మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని చెప్పారు. త‌క్ష‌ణ‌మే ఉద్ద‌వ్ ఠాక్రే సార‌థ్యంలోని శివ‌సేన పార్టీ ప‌నై పోయింద‌ని అక్క‌డ నాయ‌కులు ఎవ‌రూ లేర‌న్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేల బ‌ల‌గం క‌లిగిన త‌మ పార్టీని అస‌లైన‌, సిస‌లైన శివ‌సేన పార్టీగా గుర్తించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు సీఎం షిండే. త‌మ‌దై అస‌లైన పార్టీ అని పేర్కొన్నారు.

వెంట‌నే ఉద్ద‌వ్ ఠాక్రే నేతృత్వంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్య‌వ‌ర్గాన్ని రద్దు చేయాల‌ని కోరారు. ఈ మేర‌కు ఉద్ద‌వ్ ఠాక్రే నియ‌మించిన శివ‌సేన జాతీయ కార్య‌వ‌ర్గాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఏక్ నాథ్ షిండే సీఈసీకి రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.

తాజ‌గా కొత్త కార్య‌వ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా శివ‌సేన పార్టీకి సంబంధించి రాహుల్ ఇవాళ లోక్ స‌భ ప‌క్ష నేత‌గా ఎన్నిక‌య్యారు. ఆయ‌న‌ను గుర్తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా.

తాను కొత్త సంస్థ‌ను ఏర్పాటు చేశాన‌ని షిండే లేఖ‌లో తెలిపారు. ఇదిలా ఉండ‌గా ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) నేతృత్వంలోని తిరుగుబాటు గ్రూపులో మెజారిటీ ఎక్కువ‌గా ఉంది.

మ‌రో వైపు ఉద్ద‌వ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండేల‌కు సంబంధించిన కీల‌క కేసు సుప్రీంకోర్టులో ఇవాళ విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఏం చెబుతుంద‌నేది ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : క‌ష్టాల్లో సైతం ఉద్ధ‌వ్ వెంటే సంజ‌య్ రౌత్

Leave A Reply

Your Email Id will not be published!