Election Code : 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల కోడ్ అమ‌లు

స్ప‌ష్టం చేసిన కేంద్ర ఎన్నిక‌ల అధికారి

Election Code : న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశంలోని 5 రాష్ట్రాల‌లో శాస‌న స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ ను ప్ర‌క‌టించింది. ప్ర‌క‌టించిన రాష్ట్రాల ప‌రంగా చూస్తే తెలంగాణ‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ , మ‌ధ్య ప్ర‌దేశ్ , మిజోరం , రాజ‌స్థాన్ ఉన్నాయి. ఇక తెలంగాణ‌లో న‌వంబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 3న రిజల్ట్స్ ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Election Code for Five States

ఒక్క ఛ‌త్తీస్ గ‌ఢ్ లో రెండు ప‌ర్యాయాలు పోలింగ్ జ‌రుగుతుంద‌ని సీఈసీ రాజీవ్ కుమార్(Rajiv Kumar) స్ప‌ష్టం చేశారు. న‌క్స‌లైట్ల ప్ర‌భావిత ప్రాంతాలు ఉండ‌డం వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా అక్టోబ‌ర్ 9 సోమ‌వారం నుండి ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇక ప్ర‌భుత్వాల ప‌రంగా ఎలాంటి హామీలు, అధికారిక ప్ర‌క‌ట‌న‌లు, జీవోలు జారీ చేసేందుకు వీలు ఉండ‌ద‌న్నారు రాజీవ్ కుమార్.

న‌వంబ‌ర్ 3న గెజెట్ రానుంద‌ని, న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుకు గ‌డువు , 15న తుది ప‌రిశీల‌న ఉంటుంద‌న్నారు. న‌వంబ‌ర్ 30న పోలింగ్ జ‌రుగుతుంద‌ని , య‌ధావిధిగా ప్ర‌క‌టించిన విధంగా డిసెంబ‌ర్ 3న తుది ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Telangana Election : వృద్దులు..దివ్యాంగుల‌కు తీపి క‌బురు

Leave A Reply

Your Email Id will not be published!