Election Code : ఎన్నికలు ముగిసే దాకా 144 సెక్షన్
మార్గదర్శకాలు జారీ చేసిన ఈసీ
Election Code : తెలంగాణ – కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో అక్టోబర్ 9 నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ మేరకు పార్టీలు, అభ్యర్థులకు మార్గదర్శకాలు జారీ చేసింది ఈసీ. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి సౌండ్స్ ఉండ కూడదని స్పష్టం చేసింది. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎవరు రూల్స్ పాటించక పోయినా చర్యలు తప్పవని హెచ్చరించింది.
Election Code Hyderabad Silent
మైకులు, మీటింగ్స్ , ర్యాలీలపై నిషేధం ఉంటుందని పేర్కొంది. ఇక ఆయా పార్టీల ప్రచార వాహనాలకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్నికలు ముగిసేంత వరకు రాష్ట్రంలో(Telangana) 144వ సెక్షన్ అమలులో ఉంటుందని హెచ్చరించింది. ఆయా పొలిటికల్ పార్టీలు, అభ్యర్థులు, నేతలు విధిగా రూల్స్ పాటించాలని ఆదేశించింది ఈసీ.
వాహన చట్టానికి లోబడి లౌడ్ స్పీకర్లు ఉండాలి. రూల్స్ పాటించాలి. ఇందుకు గాను అధికారుల అనుమతి తప్పనిసరి. ప్రచారానికి సంబంధించి అభ్యర్థి పేరుతో తీసుకున్న వాహనాన్ని మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలో రాజకీయ ప్రచారాలు చేయకూడదు. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచి ఎన్నికల ప్రచారం చేయకూడదు. దీనిపై పూర్తిగా నిషేధం ఉంటుంది. పోలింగ్ స్టేషన్ లోకి సెక్యూరిటీకి అనుమతి ఉండదు. పోలింగ్ కు 48 గంటల ముందు నుంచి మీడియా, పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారంపై నిషేధం ఉంటుంది.
Also Read : CM KCR Tour : సీఎం కేసీఆర్ జంగు సైరన్