EC Accepted : డీకే నామినేషన్ కు ఈసీ ఓకే
కనకపుర నుంచి ఏడుసార్లు గెలుపు
EC Accepted : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ కు భారీ ఊరట లభించింది. రాష్ట్రంలోని కనకపుర నుంచి ఆయన వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన మద్దతుదారుల బల ప్రదర్శన మధ్య ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ పై అభ్యంతరం వ్యక్తం కావడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ దాఖలు చేసిన నామినేషన్ ను(EC Accepted) తాము అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆయనకు భారతీయ జనతా పార్టీకి చెందిన రెవెన్యూ శాఖ మంత్రి ఆర్. అశోక్ కు మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
గురువారం డీకే శివకుమార్ నామినేషన్ రద్దు చేయబడితే ముందు జాగ్రత్త చర్యగా ఆయన సోదరుడు , బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్ కూడా అదే నియోజకవర్గానికి బ్యాకప్ అభ్యర్థిగా తన పత్రాలను దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ ఆరోపణలు, పన్ను ఎగవేత కేసులకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ , ఆదాయపు పన్ను డిపార్ట్ మెంట్ ద్వారా బహుళ విచారణలను ఎదుర్కొంటున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని ఆరోపించారు డీకే శివకుమార్(DK Shivkumar).
ఇక ఇక్కడ బీజేపీ నుంచి అశోక్ ను బరిలోకి దింపింది. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన అశోక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పకు సన్నిహుతుడిగా పేరొందారు.
Also Read : స్వలింగ వివాహాలకు బెనర్జీ సపోర్ట్