Siddaramaiah : తెలంగాణ – కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు సంబంధించి యాడ్స్ ను వెంటనే నిషేధించాలని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. భారతీయ జనతా పార్టీ ఈ మేరకు ఈసీకి ఫిర్యాదు చేసింది. అక్కడి ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ యాడ్స్ డిస్ ప్లే చేస్తున్నారని, ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని ఆరోపించింది. వెంటనే నిలిపి వేయాలని లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వాపోయింది.
Siddaramaiah Got Notice from EC
దీంతో సిద్దరామయ్యకు(Siddaramaiah) సంబంధించిన యాడ్స్ (ప్రకటనలు) ను తక్షణమే నిలిపి వేయాలని ఆదేశించింది. లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని సీఎంను హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది సీఈసీ.
కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలను పోల్ బాడీ నిషేధించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ దినపత్రికల్లో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ప్రకటనలు ఇవ్వ కూడదంటూ స్పష్టం చేసింది. రాష్ట్రంలో సముచిత స్థానాన్ని ఏర్పర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టింది.
ఇదిలా ఉండగా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని జనసేనతో పాటు బీజేపీ ఫిర్యాదు చేయడం విశేషం. ఇదిలా ఉండగా ప్రతి వారంలో ఒక రోజు సీఎం ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. ఇదే విషయాన్ని రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో కూడా స్పష్టం చేసింది.
Also Read : Asaduddin Owaisi : బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా – ఓవైసీ
