Election Commission: పోస్టల్ బ్యాలట్లు తిరస్కరణపై ఈసీ కీలక ఆదేశాలు !

పోస్టల్ బ్యాలట్లు తిరస్కరణపై ఈసీ కీలక ఆదేశాలు !

Election Commission: రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) సీల్‌ లేకున్నా పోస్టల్‌ బ్యాలట్లను తిరస్కరించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ(EC)) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ల అనుమతిపై ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసీ మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనా పంపించారు. ‘‘ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలట్లు చెల్లుబాటు అవుతాయి. ఫామ్‌ 13ఏ పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి. ఆర్వో సంతకం సహా బ్యాలట్‌ ను ధ్రువీకరించే రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలి. ఫామ్‌ 13ఏలో ఓటరు, ఆర్వో సంతకం, బ్యాలట్‌ సీరియల్‌ నంబర్‌ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు’’ అని ఈసీ స్పష్టం చేసింది.

Election Commission..

ఏపీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు పోల్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో నాలుగు లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అయితే గత ఐదేళ్ళుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. తాను అధికారంలోనికి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరిస్తాని 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో వైసీపీకు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున మద్దత్తు పలికారు. అయితే తాను అధికారంలోని వచ్చిన తరువాత సీపీఎస్ ను రద్దు చేయకపోకపోగా… దాని స్థానంలో జీపీఎస్ ను తీసుకువస్తూ ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు అనేక సార్లు పోరాటం చేసే ప్రయత్నం చేసినప్పటికీ… వారిని పోలీసు బలగాల చేత అణచివేయించడమే కాకుండా తిరిగి ఉద్యమ కారులపై అక్రమ కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు… గత కొంతకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేసే అవకాశం ఉన్నందున… వైసీపీ(YCP) పెద్దలు వారి ఓట్లు తిరస్కరణకు గురయ్యేలా కొన్ని చర్యలు తీసుకున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు వారి ఫామ్ 13ఏలో ఓటరు సంతకం చేసినప్పటికీ బ్యాలెట్ పేపర్ పై ఆర్ ఓ సీల్ వేయకుండా వైసీపీ నాయకులు తమ అనుకూలమైన ఆర్వోల ద్వారా ప్రయత్నించారని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి టీడీపీ(TDP) నాయకులు ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుల ఫిర్యాదుపై స్పందించిన ఈసీ పోస్టల్ బ్యాలెట్ల తిరస్కరణపై కీలక ఆదేశాలు జారీ చేసింది.

Also Read : CM Revanth Reddy: నిమ్స్‌ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌ రెడ్డి !

Leave A Reply

Your Email Id will not be published!