Election Commission: వివాదాస్పద ఎస్పీలపై ఈసీ కీలక చర్యలు !

వివాదాస్పద ఎస్పీలపై ఈసీ కీలక చర్యలు !

Election Commission: పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ఎస్పీలుగా ఉన్న అధికారులపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఎస్పీలపై నమోదయిన అభియోగాలపై నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఈసీ సస్పెండ్‌ చేసిన ఎస్పీలు అమిత్‌ బర్దర్‌, బిందు మాధవ్‌, బదిలీ అయిన ఎస్పీ కృష్ణకాంత్‌కు నోటీసులు జారీ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి అల్లర్ల లో ఎస్పీల వైఫల్యం, పాత్రపై విచారణ జరగనుంది. ఎస్పీల వివరణ ఆనంతరం నేరుగా విచారించే అవకాశం ఉంది.

Election Commission Comment

ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజిలాల్‌ ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్‌ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజిలాల్‌ ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు.

Also Read : MLA Harish Rao : కిర్గిజిస్తాన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థులపై భద్రత తీసుకోవాలి

Leave A Reply

Your Email Id will not be published!