Election Commission : భారీగా ఉన్నతాధికారుల బదిలీలు
తెలంగాణలో ఎన్నికల నేపథ్యం
Election Commission : తెలంగాణ – రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు నవంబర్ 30న శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులతో పాటు పలువురు డీఈవోలను బదిలీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 మంది ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉండగా తెలంగాణలో బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారులలో 9 మంది నాన్ క్యాడర్ పోలీస్ అధికారులు ఉన్నారు. ఇక బదిలీ అయిన వారిలో హైదరాబాద్ , వరంగల్ , నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు ఉన్నారు.
Election Commission Transfers
అధికారుల పనితీరు, సంబంధిత సమాచారం తీసుకున్న అనంతరం తెలంగాణ(Telangana) లోని రంగారెడ్డి, మేడ్చల్ , మల్కాజ్ గిరి, యాదాద్రి, భువన గిరి, నిర్మల్ జిల్లాల లోని నలుగురు జిల్లా విద్యా శాఖ అధికారుల (డీఈవో)ను బదిలీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున ధనం చేతులు మారిందన్న ఫిర్యాదులు అందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతే కాకుండా రవాణా శాఖ కార్యదర్శి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌ను కూడా తొలగించాలని కమిషన్ ఆదేశించింది.
ఎన్నికల సమయంలో పటిష్టమైన పనిని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కూడా నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Also Read : Telangana Election Comment : పార్టీల జపం గెలుపు మంత్రం