ఎన్నిక‌ల సంఘం నిర్వాకం అఖిలేష్ యాద‌వ్ ఆగ్ర‌హం

స‌ర్ పేరుతో ల‌క్ష‌లాది ఓట్ల‌ను గాయ‌బ్ చేశారు

ల‌క్నో : మాజీ ముఖ్య‌మంత్రి, స‌మాజ్ వాది పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్వాకాన్ని ప్ర‌శ్నించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఒంటెత్తు పోక‌డ‌ను త‌ప్పు ప‌ట్టారు. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికే ఆయ‌న‌పై పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం అవుతోంద‌ని పేర్కొన్నారు. ఇవాళ అఖిలేష్ యాద‌వ్ మీడియా తో మాట్లాడారు. ఇదిలా ఉండ‌గా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు అంగీకరించడం పీడీఏ కూటమి సాధించిన అతిపెద్ద విజయం అని పేర్కొన్నారు. మీరంతా అనుభవజ్ఞులైన, అవగాహన కలిగిన పాత్రికేయులు. స‌ర్ ప్రక్రియపై చర్చలు, ఆరోపణలు జరుగుతున్నప్పటికీ, ఒకే వ్యక్తి పేరు పది ఓటర్ ఐడి కార్డుల్లో ఉండటం, ఒకే వ్యక్తికి ఐదు కార్డులు జారీ కావడం, ఒకే వ్యక్తికి సంబంధించిన కార్డులు నాలుగు వేర్వేరు పోలింగ్ బూత్‌లలో పంపిణీ చేయబడటం వంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వాపోయారు అఖిలేష్ యాద‌వ్.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స‌ర్ ) ప్రక్రియలో జరిగిన అక్రమాలను భారీ లోపాలు’గా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ కోసం చేసిన వ్యయంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా, ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఎన్నికల సంఘం ఈ అక్రమాలను అంగీకరించడం పీడీఏ (పిఛ్డా, దళిత్, అల్పసంఖ్యాక్ – వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు) కూటమికి దక్కిన గొప్ప విజయమని అన్నారు. స‌ర్ ప్రక్రియ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు, పైగా ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఈ సమస్యలను అంగీకరిస్తూ, వీటిని ‘చిన్న చిన్న పొరపాట్లు’ అని చెబుతోంది. ఇవి చిన్న పొరపాట్లు కావు, ఇవి చాలా పెద్ద అక్రమాలు అని అఖిలేష్ యాదవ్ అన్నారు.

జంతర్ మంతర్‌ను నిరసన ప్రదర్శనలకు అనుమతించే ప్రాంతాల జాబితా నుండి తొలగించడంపై మండిప‌డ్డారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత. ఈ నిర్ణయం వెనుక ఉన్న పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.

Leave A Reply

Your Email Id will not be published!