Delhi Mayor Election : ఢిల్లీ బ‌ల్దియా మేయ‌ర్ ఎన్నిక వాయిదా

ఆమ్ ఆద్మీ పార్టీ..బీజేపీ కౌన్సిల‌ర్ల మ‌ధ్య వివాదం

Delhi Mayor Election : ఢిల్లీ బ‌ల్దియా మేయ‌ర్ ఎన్నిక మ‌రోసారి వాయిదా ప‌డింది. అత్య‌ధిక స్థానాలు క‌లిగిన ఆప్ , బీజేపీ మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మొత్తం 250 స్థానాల‌కు గాను ఆప్ 134 స్థానాలు కైవ‌సం చేసుకుని ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. కానీ మేయ‌ర్ ఎన్నిక(Delhi Mayor Election) కొన‌సాగేందుకు బీజేపీ అడ్డంకిగా మారింది. కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున నియ‌మించ‌బ‌డిన ఎల్జీ విన‌య్ కుమార్ సక్సేనా నిర్వాకం కార‌ణంగానే మేయ‌ర్ ఎన్నిక జ‌ర‌గ‌డం లేద‌ని ఆప్ ఆరోపించింది.

ముందుగానే నామినేటేడ్ స‌భ్యుల‌ను ఎల్జీ నియ‌మించ‌డం రాద్దాంతానికి దారి తీసింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది ఆప్. ఈ మేర‌కు ఆప్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. పిటిష‌న్ దాఖ‌లు చేసింది.ఇది విచార‌ణ కొన‌సాగుతుండ‌గానే ఎల్జీ కావాల‌ని మేయ‌ర్ ఎన్నిక జ‌ర‌గ‌కుండా చేస్తున్నాడంటూ ఆప్ ఫైర్ అయ్యింది. ఈ మేర‌కు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాము అధికారంలోకి వ‌చ్చేందుకు కావాల్సిన మెజారిటీని క‌లిగి ఉన్నామ‌ని కానీ నామినేటెడ్ స‌భ్యుల‌ను బీజేపీకి చెందిన వారిని ఎలా నియ‌మిస్తారంటూ ప్రశ్నించారు సీఎం. ఇదిలా ఉండ‌గా మేయ‌ర్ ఎన్నిక కోసం స‌భ్యులంతా స‌మావేశం అయ్యారు. నామినేటెడ్ సభ్యులు సైతం త‌మ‌కు ఓటు హ‌క్కు ఉందంటూ పేర్కొన‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపింది ఆప్.

ఇలాంటి ప‌రిస్థితుల్లో తాము ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ లేమ‌ని పేర్కొన్నారు ఎన్నిక‌ల అధికారి స‌త్య శ‌ర్మ‌. దీంతో ఎన్నిక‌లను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Also Read : అదానీ అవ‌క‌త‌వ‌క‌ల‌పై చ‌ర్చించాలి

Leave A Reply

Your Email Id will not be published!