Shehbaz Sharif : పాక్ ప్ర‌ధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ ఎన్నిక‌

ఎన్నుకున్న ప్ర‌తిప‌క్షాల స‌భ్యులు

Shehbaz Sharif : పాకిస్తాన్ లో తీవ్ర సంక్షోభానికి తెర దించుతూ ఆ దేశ నూత‌న ప్ర‌ధాన మంత్రిగా అంతా అనుకున్న‌ట్టే విప‌క్షాల‌న్నీ క‌లిసి షెహ‌బాజ్ ష‌రీఫ్ (Shehbaz Sharif) ను ఎన్నుకున్నారు. ఇప్ప‌టికే అవిశ్వాస తీర్మానం లో ఓట‌మి పాలైన మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ త‌ప్పుకున్నారు.

ఆయ‌న కేవ‌లం 2 ఓట్ల తేడాతో ఓడి పోయారు. అంతే కాదు తాము పూర్తిగా రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దొంగ‌ల స‌ర‌స‌న తాము కూర్చో ద‌ల్చు కోలేదంటూ ప్ర‌కటించారు.

ఇదిలా ఉండ‌గా కొత్త‌గా ప్ర‌ధానిగా ఎన్నికైన షెహ‌బాజ్ ష‌రీఫ్ కు స్వ‌యాన అన్న గ‌తంలో పాకిస్తాన్ దేశానికి ప్ర‌ధానిగా రెండు సార్లు ఎన్నిక‌య్యారు.

పాకిస్తాన్ త్రెహీక్ ఇ ఇన్సాఫ్ నాయ‌కుడు షా మ‌హమూద్ ఖురేషీ కూడా త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆమోదించ‌డంతో ఉత్కంఠ నెల‌కొంది.

కానీ చివ‌ర‌కు విప‌క్ష సభ్యులంతా క‌లిసి ఏక‌గ్రీవంగా షెహ‌బాజ్ ష‌రీఫ్(Shehbaz Sharif) ను ఎన్నుకున్నారు. కాగా ఈ సెష‌న్ కు ముందు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని జాతీయ అసెంబ్లీకి చెందిన పీటీఐ స‌భ్యులంతా మూకుమ్మ‌డిగా రాజీనామా చేశారు.

ఖురేషీ వాద‌న‌కు ముగింపు ప‌లికారు. 12 గంట‌ల‌కు పైగా చ‌ర్చ జ‌రిగిన అనంత‌రం అవిశ్వాస తీర్మానం వీగి పోవ‌డంతో ప్ర‌ధాని నుంచి త‌ప్పుకున్నారు ఇమ్రాన్ ఖాన్ .

ఆ వెంట‌నే ఆయ‌న ప్ర‌ధాని అధికార భ‌వ‌నం నుంచి ఖాళీ చేసి వెళ్లి పోయారు. స్పీక‌ర్ అసద్ ఖాసియ‌ర్ త‌న ప‌ద‌వికి రాజ‌నామా చేశాక ప్యాన‌ల్ ఆఫ్ చైర్స్ స‌భ్యుడు అయాజ్ సాదిక్ అధ్య‌క్ష‌త వ‌హించిన‌ట్లు జియో న్యూస్ వెల్ల‌డించింది.

Also Read : సుప్రీంకోర్టు ఆదేశాలు స్పీక‌ర్ బేఖాత‌ర్

Leave A Reply

Your Email Id will not be published!