Himachal Pradesh Poll : ‘హిమాచల్’ లో నవంబర్ 13న ఎన్నికలు
డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడి - ఎన్నికల సంఘం
Himachal Pradesh Poll : ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తేదీని ప్రకటించింది. వచ్చే నవంబర్ 12న పోలింగ్ చేపట్టనుంది. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తాందని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్ తో పాటు గుజరాత్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు నిర్వహించనుంది.
ఇదిలా ఉండగా లక్షా 86 వేల మంది కొత్తగా హిమాచల్ ప్రదేశ్ లో నమోదు చేసుకున్నారు. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించడంతో హిమాచల్ ప్రదేశ్ లో(Himachal Pradesh Poll) రాజకీయాలు ఊపందుకున్నాయి. దాదాపు రెండేళ్లలో కరోనా వైరస్ నియంత్రణలు లేకుండా రాష్ట్ర ఎన్నికలు నిర్వహించడం ఇదే తొలిసారి.
కరోనా పట్ల అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ శుక్లా. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తర ప్రదేశ్ , మణిపూర్ , ఉత్తరాఖండ్ , గోవా, పంజాబ్ ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించిన సమయంలో కరోనా ఎఫెక్టు ఎక్కువగా ఉందన్నారు.
అయినా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలను సజావుగా నిర్వహించామని చెప్పారు సీఈసీ. ఇదిలా ఉండగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కొలువు తీరి ఉన్నాయి. మరోసారి పవర్ లోకి రావాలని యోచిస్తోంది బీజేపీ. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ స్వంత రాష్ట్రమైన గుజరాత్ లో 182 మంది సభ్యులు ఉండగా హిమాచల్ ప్రదేశ్ లో 68 స్థానాలు ఉన్నాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు సైతం నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారంలో మునిగి పోయాయి.
Also Read : హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు