Manish Tewari : ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి – మనీష్ తివారీ
నిష్పక్షపాతంగా కొనసాగాలని డిమాండ్
Manish Tewari : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. సీడబ్ల్యూసీ సమవేశంలో అక్టోబర్ 17న ఎన్నిక జరపాలని నిర్ణయించింది. 19న అధ్యక్షుడి ఫలితం ప్రకటిస్తారు.
ఇప్పటికే జి23 అసమ్మతి కూటమిలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన మాజీ కేంద్ర మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయనకు మద్దతుగా జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.
పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఈ తరుణంలో అసమ్మతి నాయకుడిగా పేరొందిన తిరువనంతపురం రాజ్యసభ ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మాతృభూమి పత్రికలో వ్యాసం రాశారు. ఇందులో తాను కూడా ఏఐసీసీ చీఫ్ రేసులో ఉన్నానని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా నిర్వహించాలని కోరారు.
ఒక్క అధ్యక్ష పదవికే కాకుండా అన్ని పదవులకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాజాగా మరో జి23 టీంలో సభ్యుడిగా పేరొందిన
మనీష్ తివారీ(Manish Tewari) షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఒటర్ల జాబితాను డిక్లేర్ చేశామని, పోటీ చేయాలని అనుకునే ఏ సభ్యుడైనా తనిఖీ చేయాలని అనుకుంటే పీసీసీ ఆఫీసులను సందర్శించ వచ్చని మరో నేత మధుసూదన్ మిస్త్రీ పేర్కొనడాన్ని తప్పు పట్టారు తివారీ.
పార్టీ పరంగా జరిగే అధ్యక్ష ఎన్నిక నిష్పక్ష పాతంగా జరుగుతుందన్న నమ్మకం తనకు కలగడం లేదన్నారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే వారందరి పేర్లతో కూడిన జాబితాను ప్రచురించాలని కోరారు.
Also Read : రాజ్ థాకరేతో బీజేపీ చీఫ్ సమావేశం