King Charles : ఎలిజబెత్ జీవితం అజరామరం – చార్లెస్
ఎలిజబెత్ జీవితం అజరామరం - చార్లెస్
King Charles : సుదీర్ఘ కాలం పాలు గ్రేట్ బ్రిటన్ కు రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ -2 కన్ను మూశారు. 96 ఏళ్ల పాటు జీవించిన ఆమె తనదైన ముద్ర వేశారు పాలనా పరంగా. క్వీన్ స్థానంలో యుకెకు రాజుగా కొలువు తీరారు కింగ్ చార్లెస్(King Charles).
ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. క్వీన్ ఎలిజబెత్ దేశానికి సార్వభౌమాధికారిణిగా ఉన్నప్పటికీ తను మూలాలు మరిచి పోలేదన్నారు. పరిమితులు ఏమిటో గుర్తించింది.
జీవిత కాలం పాటు సేవ చేయడంలో నిమగ్నమైందని పేర్కొన్నారు. ఆమె సాగించిన ప్రస్థానం గొప్పది. ప్రపంచంలో చోటు చేసుకున్న పరిణామాలను, సంఘటనలను క్వీన్ ఎలిజబెత్ చూశారు.
వాటిని తట్టుకుని నిలబడేలా దేశాన్ని ముందుకు నడిపించారు. ఆమె తెలివి తేటలకు, ధైర్య సాహసాలకు ప్రతీక అని కొనియాడారు చార్లెస్. బ్రిటన్ కొత్త చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరించిన చార్లెస్(King Charles) సంతాప సందేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎలిజబెత్ అసాధారణమైన వ్యక్తిత్వం కలిగినదని పేర్కొన్నారు. సాయంత్రం టివీ ఛానల్ ద్వారా ప్రసంగించారు చార్లెస్. నేను మీతో తీవ్రమైన దుఖఃంతో మాట్లాడుతున్నా. ఆమె నాకు ప్రియమైన తల్లి. జీవితాంతం తనతో పాటు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది.
సంక్షోభ సమయంలోనూ, కష్ట కాలంలోనూ ధైర్యాన్ని నూరి పోసిందని కొనియాడారు. క్వీన్ మమ్మల్నే కాదు కోట్లాది ప్రజలను ప్రభావితం చేసిందన్నారు. ఆమె జీవిత కాలమంతా ప్రేరణగా నిలుస్తారని స్పష్టం చేశారు.
తన తల్లి అందించిన ప్రేమ, ఆప్యాయత, మార్గదర్శకత్వం, అవగాహన గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు కింగ్ చార్లెస్.
Also Read : క్వీన్ అంత్యక్రియలకు హాజరవుతా- బైడెన్
'We owe her the most heartfelt debt any family can owe to their mother for her love, affection, guidance, understanding and affection'
King Charles III pays tribute to his mother the Queen as he addresses the nation for the first time since her death.https://t.co/JT1DgpKdev pic.twitter.com/xk95fYyfRp
— ITV News (@itvnews) September 9, 2022