Elon Musk : ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేత
టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్
Elon Musk : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సోషల్ మీడియా ను శాసిస్తున్న మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్బిట్టర్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ట్వీట్ చేశాడు. ట్విట్టర్ కు సంబంధించిన డీల్ ను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆయన చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. దీ
నికి సంబంధించి ట్విట్టర్ సిఇఓ పరాగ్ అగర్వాల్ ఇంకా స్పందించ లేదు. $44 బిలియన్ డాలర్ల డీల్ ను హోల్డ్ లో పెట్టినట్లు వెల్లడించారు.
స్పామ్, నకిలీ ఖాతాలను ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 5 శాతం కంటే తక్కువ వినియోగదారులను సూచిస్తాయని తెలిపారు.
ఎలోన్ మస్క్(Elon Musk) చేసిన ట్వీట్ దెబ్బకు ట్విట్టర్ కంపెనీ షేర్లు ప్రీ మార్కెట్ ట్రేడింగ్ లో 17.7 శాతం క్షీణించి $37.10కి పడి పోయాయి. ఏప్రిల్ ప్రారంభంలో ఎలోన్ మస్క్ కంపెనీలో తన వాటాను వెల్లడించినప్పటి నుంచి కనిష్ట స్థాయికి చేరుకుంది.
స్పామ్ , నకిలీ ఖాతాలు వాస్తవానికి 5 శాతం కంటే తక్కువ వినియోగదారులను సూచిస్తాయనే గణనకు మద్దతుగా పెండింగ్ లో ఉన్న వివరాలను ట్విట్టర్ డీల్ ను కొంత కాలం పాటు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు ఎలోన్ మస్క్(Elon Musk) .
స్వయం ప్రకటిత స్వేచ్ఛా, వాక్ స్వాతంత్ర , ఫ్లాట్ ఫారమ్ నుండి స్పామ్ లను తీసి వేయడం తన ప్రాధాన్యతలలో ఒకటి అని స్పష్టం చేశాడు. తాజాగా మస్క్ చేసిన ట్వీట్ పై ట్విట్టర్ ఇంకా స్పందించక పోవడం ఉత్కంఠ రేపింది.
Also Read : 3డీ ప్రింటింగ్ పై తెలంగాణ ఫోకస్