Elon Musk H1B : ప్ర‌వాస భార‌తీయుల‌కు మ‌స్క్ షాక్

హెచ్1బి వీసాదారుల‌కు క‌ష్టాలు

Elon Musk H1B : టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్ ఎప్పుడైతే ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్నారో సంచ‌ల‌న నిర్ణ‌యాల తీసుకుంటున్నారు. కోలుకోలేని షాక్ ఇచ్చారు. ప్ర‌ధానంగా ఉద్యోగులు మ‌నోడి దెబ్బ‌కు వ‌ణుకుతున్నారు. ఎప్పుడు ఎవ‌రికి మూడుతుందోన‌ని బెంబేలెత్తుతున్నారు.

ప్ర‌తి రోజూ ఇమెయిల్ చూసుకుంటూ బ‌తుకు జీవుడా అంటూ వేడుకుంట‌న్నారు. ట్విట్ట‌ర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 7,500 మంది ఎంప్లాయిస్ ప‌ని చేస్తుండ‌గా ఇప్ప‌టికే 50 శాతానికి పైగా ఉద్యోగుల‌ను తీసి వేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ట్విట్ట‌ర్ కు సంబంధించిన ప్ర‌ధాన కార్యాల‌యాల‌ను తాత్కాలికంగా మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఎలాన్ మ‌స్క్(Elon Musk).

మ‌రో వైపు బ్లూ టిక్ పై కూడా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దానిని పొందాలంటే ఇక నుంచి $8 డాల‌ర్లు చెల్లించాల్సిందేనంటూ స్ప‌ష్టం చేశారు. ఒక నెల లోపు ఇండియాలో బ్లూ టిక్ తీసుకు వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఎలాన్ మ‌స్క్. ఈ త‌రుణంలో ఇప్ప‌టి వ‌ర‌కు ట్విట్ట‌ర్ లో కీల‌క‌మైన పోస్టుల‌లో ప్ర‌వాస భార‌తీయులు (ఎన్నారైలు) ఉన్నారు.

ప్ర‌ధానంగా సిఇఓగా ప‌రాగ్ అగ‌ర్వాల్, లీగల్ హెడ్ విజ‌యా గద్దె ను టేకోవ‌ర్ చేసుకున్న వెంట‌నే సాగ‌నంపారు. ఈ త‌రుణంలో పెద్ద ఎత్తున ఎన్నారైలు కూడా తొలగించిన వారిలో ఉన్నారు. ప్ర‌స్తుతం హెచ్1బి(H1B) వీసాదారులు జాబ్స్ కోల్పోయిన ఆరు నెల‌ల లోపు తిరిగి జాబ్స్ పొందాల్సి ఉంటుంది అమెరికాలో.

లేక పోతే అమెరికాలో ప్ర‌వాస భార‌తీయులు వీడాల్సిందే. ఒక ర‌కంగా ఎలాన్ మ‌స్క్ కొట్టిన దెబ్బ మ‌నోళ్ల‌కు నిద్ర లేకుండా చేసింది.

Also Read : ఎలాన్ మ‌స్క్ పై జో బైడ‌న్ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!