Elon Musk : ట్విట్ట‌ర్ డీల్ కు ఎలోన్ మ‌స్క్ గుడ్ బై

వ‌దులుకుంటే భారీ ఎత్తున జరిమానా

Elon Musk : సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాడు ప్ర‌పంచ కుబేరుడు, టెస్లా సిఇఓ ఎలోన్ మ‌స్క్(Elon Musk). గ‌త ఏప్రిల్ లో మైక్రో బ్లాగింగ్ సంస్థ‌ను కొనుగోలు చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

ఈ మేర‌కు ట్విట్ట‌ర్ తో ఒప్పందం కూడా చేసుకున్నాడు ఎలోన్ మ‌స్క్. గ‌త కొన్ని రోజులుగా ట్విట్ట‌ర్ ను గంద‌ర గోళానికి గురి చేస్తూ వచ్చాడు ఈ కుబేరుడు. మ‌స్క్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ఒక్క‌సారిగా ట్విట్ట‌ర్ ఆందోళ‌న‌కు గురైంది.

మ‌స్క్ వ‌ల్ల ఆ సంస్థ‌కు తీర‌ని న‌ష్టం వాటిల్లింది. ఇదే స‌మ‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ట్విట్ట‌ర్ చైర్మ‌న్ బ్రెట్ టేలో. బోర్డు చ‌ట్ట ర‌మైన చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు మ‌స్క్ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.

ఫేక్ ఖాతాల సంఖ్య గురించి త‌ప్పు దోవ ప‌ట్టించే ప్ర‌క‌ట‌నలు ఉన్నాయంటూ ఆరోపించడం క‌ల‌క‌లం రేపింది. దీనిని ప్ర‌ధానంగా సాకుగా చూపించి డీల్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు ఎలోన్ మ‌స్క్(Elon Musk).

$44 బిలియ‌న్ డాల‌ర్లకు ఒప్పందం చేసుకున్నాడు. ఇక రెగ్యులేట‌రీ ఫైలింగ్ లో ఎలోన్ మ‌స్క్ లాయ‌ర్లు ట్విట్ట‌ర్ ప్లాట్ ఫార‌మ్ లోని న‌కిలీ లేదా స్పామ్ ఖాతాల స‌మాచారం అభ్య‌ర్థించినా స‌మాచారం ఇవ్వ‌డంలో ఫెయిల్ అయ్యిందంటూ ఆరోపించారు.

ఇది కంపెనీ వ్యాపార ప‌నితీరుకు ప్రాథ‌మిక‌మైన‌దిగా పేర్కొన్నారు. మ‌రో వైపు ట్విట్ట‌ర్ ఘాటుగా స్పందించింది. ట్విట్ట‌ర్ బోర్డు మ‌స్క్ తో అంగీక‌రించిన ధ‌ర , రూల్స్ పై లావాదేవీని మూసి వేసేందుకు క‌ట్టుబ‌డి ఉంది.

విలీన ఒప్పందాన్ని అమ‌లు చేసేందుకు చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు కొన‌సాగించాల‌ని యోచిస్తోంద‌ని చెప్పారు ట్విట్ట‌ర్ చైర్మ‌న్. ఈ రూల్స్ పాటించ‌క పోతే లేదా వైదొలిగితే $1 బిలియ‌న్ బ్రేక‌ప్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : మ‌స్క్ నిర్ణ‌యం ట్విట్ట‌ర్ ఉద్యోగులు ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!