Elon Musk : ట్రంప్ కు ఎలోన్ మస్క్ గుడ్ న్యూస్
అతడిపై నిషేధం ఎత్తి వేస్తామని ప్రకటన
Elon Musk : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ఆయన $44 బిలియన్ల భారీ ధరకు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. సదరు సంస్థ తన స్వంతం కావాలంటే ఇంకా ఆరు నెలల సమయం ఉంది.
అంత లోపు చేయాల్సిందంతా చేస్తున్నాడు మస్క్. ఇప్పటికే దాని వాల్యూ పెంచే ప్రయత్నంలో ఉన్నాడు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆందోళనలు ప్రేరేపించేలా డొనాల్డ్ ట్రంప్ పాల్పడ్డాడంటూ ట్విట్టర్ తో పాటు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్ , , తదితర మాధ్యమాలన్నీ ట్రంప్ పై పూర్తి స్థాయిలో నిషేధం విధించాయి.
దీనిపై నిప్పులు చెరిగినా ఆయన ఖాతాలను ఆయా సంస్థలు పునరుద్దరించలేదు. దీంతో తానే వాటికి ధీటుగా, ప్రత్యామ్నాయంగా మరో కొత్త సోషల్ మీడియాను ఏర్పాటు చేశారు.
దాని పేరు ట్రూత్. ప్రారంభం అయినా ఇంకా జనంలోకి రాలేదు. ఈ తరుణంలో ఇటీవలే ట్విట్టర్ ను ఓన్ చేసుకున్న మస్క్ ట్రంప్(Elon Musk) కు తీపి కబురు చెప్పారు.
వీరిద్దరి మధ్య బంధం బలంగా ఉంది. ట్విట్టర్ కొనుగోలు పూర్తయ్యాక ట్రంప్ పై ట్విట్టర్ విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తామంటూ ప్రకటించారు ఎలోన్ మస్క్(Elon Musk).
కుంభకోణాలు, నకిలీ ఖాతాలు, అభ్యంతరకరమైనవి ఉంటే ఎత్తివేయాలి లేదా నిషేధం విధించాలని సూచించారు. ట్రంప్ పై నిషేధం సరికాదంటూ పేర్కొన్నారు. వెంటనే ఎత్తి వేస్తానంటూ ప్రకటించడం కలకలం రేపింది.
ఇదిలా ఉండగా ట్రంప్ వెనుక నుంచి మస్క్ కు సపోర్ట్ చేశారని, కావాలనే ట్విట్టర్ ను దెబ్బ కొట్టేలా చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
Also Read : ఫిలిప్పీన్స్ ఎన్నికల్లో మార్కోస్ విక్టరీ