Elon Musk : ట్విట్ట‌ర్ యూజ‌ర్ల‌కు ఖుష్ క‌బ‌ర్

ఎలోన్ మ‌స్క్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

Elon Musk : ట్విట్ట‌ర్ యూజ‌ర్ల‌కు శుభ‌వార్త చెప్పారు టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ సిఇఓ ఎలోన్ మ‌స్క్(Elon Musk). ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భారీ ధ‌ర‌కు మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేశాడు. ఏకంగా రూ. 4,400 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేజిక్కించుకున్నాక కీల‌క మార్పులు చేశాడు. టాప్ లెవ‌ల్ ఎగ్జిక్యూటివ్ ల‌ను తొల‌గించాడు. కొన్ని ఆఫీసుల‌ను మూసి వేశాడు. ఆపై బ్లూ టిక్ మార్క్ పై కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు.

ఎవ‌రైనా స‌రే వాడాల‌ని అనుకుంటే ఫీజు చెల్లించాలంటూ కోలుకోలేని షాక్ ఇచ్చాడు. నిత్యం ఏదో ఒక మార్పును కోరుకునే మ‌న‌స్త‌త్వం క‌లిగిన ఎలోన్ మ‌స్క్ ఏది చేసినా సంచ‌ల‌న‌మే. ప్ర‌తిరోజూ ఏదో ఒక ప్ర‌క‌ట‌న చేస్తూ నిత్యం వార్త‌ల్లో ఉంటాడు ట్విట్ట‌ర్ బాస్. తాజాగా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. ఒక ర‌కంగా కోట్లాది మంది ట్విట్ట‌ర్ యూజ‌ర్ల‌కు మేలు చేకూర్చే వార్త ఇది.

ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ కు ప్ర‌త్యామ్నాయంగా ఎన్నో వ‌చ్చినా నేటి వ‌ర‌కు దానిని అందుకోలేక పోయాయి. స‌మాచారాన్ని పంచుకోవ‌డంలో, చేర‌వేయ‌డంలో ట్విట్ట‌ర్ టాప్ లో కొన‌సాగుతోంది. ఎలోన్ మ‌స్క్ తీపి క‌బురు చెప్పాడు. ట్విట్ట‌ర్ లో యూజ‌ర్లు ఇక నుంచి కాల్స్ , మెసేజ్ లు కూడా పంపించుకునేందుకు వీలుగా కొత్త ఫీచ‌ర్ ను అందుబాటులోకి తీసుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

ప్ర‌స్తుతం మ‌స్క్(Elon Musk) చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. దీని ఎఫెక్ట్ వాట్సాప్ , లింక్డ్ ఇన్ , షేర్ చాట్, ఇన్ స్టా గ్రామ్ ల‌కు దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : యూకే టూర్ కు కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!