Elon Musk Biden : బైడెన్ పై ఎలోన్ మస్క్ కామెంట్
ఎందుకు ఎన్నుకున్నారనే దానిపై వ్యాఖ్య
Elon Musk Biden : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ప్రధానంగా ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న మైక్రో బ్లాగింగ్ దిగ్గజ సంస్థ ట్విట్టర్ ను $44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.
ఆనాటి నుంచి నేటి దాకా నిత్యం ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అన్నింటిపై సీరియస్ కామెంట్స్ చేస్తూ మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇదిలా ఉండగా ట్విట్టర్ మస్క్ వరం కావాలంటే కనీసం ఆరు నెలల టైం పడుతుంది.
అంత దాకా ఆయన ఆటలు సాగవు. ఇప్పటికే మస్క్(Elon Musk) ట్విట్టర్ యాజమాన్యం, పనిచేస్తున్న సిఇఓ, ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పక పోయినా ప్రస్తుత సిఇఓ పరాగ్ అగర్వాల్ పై ఆయన గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో ఎలోన్ మస్క్(Elon Musk) మాజీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో మంచి సంబంధం ఉంది.
ఇదిలా ఉండగా ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హింసను ప్రేరేపించారన్న అపవాదుతో ట్రంప్ పై శాశ్వత నిషేధం విధించింది ట్విట్టర్. తాను టేకోవర్ చేసుకున్నాక ట్రంప్ పై ఉన్న బ్యాన్ ఎత్తి వేస్తానని ప్రకటించాడు మస్క్.
తాజాగా ప్రస్తుత యుఎస్ చీఫ్ జోసెఫ్ బైడెన్(Biden) పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. శుక్రవారం బైడెన్ గురించి ఊహించని రీతిలో వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అది కలకలం రేపుతోంది.
బైడెన్ చేసిన తప్పిదం ఏమిటంటే ఆయన దేశాన్ని మార్చేందుకు ఎన్నుకున్నారని భావించాడు. కానీ అలా జరగడం లేదన్నారను. మస్క్ నిర్ణయాన్ని మాజీ సీఇఓ జాక్ డోర్సే ఒప్పుకున్నాడు. కొన్ని నిర్ణయాలను పునః పరిశీలించాల్సి ఉందన్నాడు.
Also Read : ట్విట్టర్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ గుడ్ బై