Elon Musk : మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కు పోటీగా ఫేస్ బుక్ మెటా థ్రెడ్స్ ను తీసుకు వచ్చింది. గురువారం విడుదల చేశారు సంస్థ సిఇఓ మార్క్ జుకెర్ బర్గ్. ఇప్పటికే ఫేస్ బుక్ మెటా నుంచి ఇన్ స్టా గ్రామ్ , వాట్సాప్ ఉన్నాయి. తాజాగా ట్విట్టర్ కంటే మరిన్ని మెరుగైన ఫీచర్స్ తో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి థ్రెడ్స్ ను తీసుకు వచ్చింది.
దీనిని డైరెక్టుగా కాకుండా ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా జాయిన్ అయ్యే ఛాన్స్ ఇచ్చింది ఫేస్ బుక్ మెటా. దీంతో ఒక్కసారిగా ఉత్కంఠకు లోనైన నెటిజన్లు ఏకంగా విడుదలైన థ్రెడ్స్ ను భారీ ఎత్తున డౌన్లోడ్ చేసుకున్నారు.
దీంతో రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తోందనని టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఇదిలా ఉండగా మెటా థ్రెడ్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు టెస్లా చైర్మన్ , ట్విట్టర్ సిఇఓ ఎలోన్ మస్క్(Elon Musk). ఈ థ్రెడ్స్ యాప్ లో ఏముందుంటూ ఎద్దేవా చేశారు. ఇదంతా కాపీ , పేస్ట్ , షేర్ తప్ప ఇంకేమీ లేదన్నారు.
ఏదైనా స్పెషాలిటీ ఏమీ లేదని, ప్రచారం తప్ప తమకు పోటీనే కాదని పేర్కొన్నారు ట్విట్టర్ సిఇవో. కాగా నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశారు ఎలోన్ మస్క్. కాగా ఉచితంగా దీనిని వాడు కోవాలన్నా ముందు ఇన్ స్టా గ్రామ్ లో ఖాతా ఉంటేనే వినియోగించుకునే ఛాన్స్ ఉంది. లేక పోతే థ్రెడ్స్ ను వాడుకునేందుకు వీలు లేదు. ఇదే డిస్ అడ్వాంటేజ్.
Also Read : KC Venu Gopal : ఇంటింటి ప్రచారంపై కాంగ్రెస్ ఫోకస్