Elon Musk : టెస్లా చైర్మన్, ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన అప్పుడప్పుడు విస్తు పోయేలా ట్వీట్లు చేస్తుంటారు. ఇప్పుడు ఆయన 9.2 శాతం షేర్లను కొనుగోలు చేశాడు ట్విట్టర్ లో. దీంతో ఎలోన్ మస్క్(Elon Musk) అనధికారికంగా సభ్యుడై పోయాడు ఆ సంస్థలో.
ఈ విషయాన్ని ట్విట్టర్ సిఇఓ పరాగ్ అగర్వాల్ ప్రకటించారు కూడా. తాజాగా ఎలోన్ మస్క్(Elon Musk) ఆసక్తికర ట్వీట్ చేశాడు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయంపై ఆయన ఛలోక్తి విసిరారు. సదరు ఆఫీసు నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చేలా ఉందని పేర్కొన్నాడు.
ఇదే విషయంపై ఆయన తాజాగా ట్విట్టర్ లో తన ఖాతా ద్వారా పోల్ ( అభిప్రాయ సేకరణ ) నిర్వహించారు. ట్విట్టర్ ప్రధాన కార్యాలయం శాన ఫ్రాన్సిస్కో లో ఉంది.
అక్కడ ఎవరూ పెద్దగా కనిపించరని తెలిపాడు. దానిని నిరాశ్రయులైన వారికి ఆశ్రయంగా మార్చేద్దామా అంటూ కోరాడు. ఇదిలా ఉండగా మనోడికి మస్తు ఫాలోయింగ్ ఉంది.
ఆయన పోస్ట్ లను మెచ్చుకోకుండా ఉండలేం. ఇష్టపడినా పడక పోయినా ఎలోన్ మస్క్ చేసే ట్వీట్లు ఆసక్తికరంగా, గుండెకు హత్తుకునేలా ఉంటాయి. పనిలో పనిగా వ్యంగ్యం ఎక్కువగా ఉంటుంది.
81 మిలియన్లకు పైగా ఎలోన్ మస్క్ ను అనుసరిస్తున్నారు నెటిజన్స్. అక్కడ ఎవరూ పని చేసేందుకు కనిపించరంటూ పేర్కొనడం కలకలం రేపింది.
ఆయన పోస్ట్ చేసిన మూడు గంటల్లో పే 6.3 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. 91 శాతం మంది అవును అని సమాధానం ఇచ్చారు. కాగా ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది..
Also Read : మస్క్ మస్తు ట్విట్టర్ జబర్దస్ద్