Elon Musk : నేను అనుమానాస్పదంగా చని పోతే
టెస్లా సిఇఓ ఎలోన్ మస్క్ సంచలన ట్వీట్
Elon Musk : ప్రపంచ కుబేరుడు టెస్లా సిఇఓ ఎలోన్ మస్క్ ఎప్పుడైతే మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను కొనుగోలు చేశాడో ఆనాటి నుంచి వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారారు.
ప్రతి రోజూ ఆయన ఏదో ఒక అంశంపై ట్వీట్ చేస్తూ నిత్యం వార్తల్లో వ్యక్తిగా మారారు. తాజాగా ఎలోన్ మస్క్ (Elon Musk )చేసిన ట్వీట్ కలకలం రేగుతోంది. ట్విట్టర్ ను భారీ $44 బిలియన్లకు కొనుగోలు చేశాడు.
దానిని స్వాధీనం చేసుకోవాలంటే ఇంకా ఆరు నెలల సమయం పట్టనుంది. ఇదే సమయంలో తాను అనుమానాస్పద స్థితి (మిస్టీరియస్ )లో చని పోతే ఎలా అంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఎలోన్ మస్క్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ప్రతి రోజూ సంచలన ట్వీట్లతో హోరెత్తిస్తూ వ్యాపార వర్గాలలో కలకలం సృష్టిస్తున్నారు.
ఇదే సమయంలో ట్విట్టర్ లో భాగస్వామ్యులు కావాలంటూ ఎలోన్ మస్క్(Elon Musk )పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎలోన్ మస్క్ ఆహ్వానానికి సౌదీ అరేబియా యువరాజు సైతం మొదట్లో విభేదించినా ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
ఇదే సమయంలో అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరోక్షంగా ఎలోన్ మస్క్ వెనుక ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. దీనిని స్వయంగా ఖండించారు ఎలోన్ మస్క్.
ఈ తరుణంలో భారీ డీల్ కు కొనుగోలు చేసిన మస్క్ ఉన్నట్టుండి ఆసక్తికకర , సంచలన ట్వీట్ చేయడం తాను చని పోతే ఎలా అని పేర్కొనడం చర్చకు దారి తీసింది.
ఉక్రెయిన్ లోని ఫాసిస్ట్ శక్తులకు సైనిక కమ్యూనికేషన్ పరికరాలను సరఫరా చేయడంలో తాను నిమగ్నమై ఉన్నానంటూ మరో పోస్ట్ చేశారు ఎలోన్ మస్క్.
Also Read : పరాగ్ ను తొలగించడం చాలా కష్టం