Elon Musk : తాజ్ మహల్ అందం అద్భుతం
కొనియాడిన టెస్లా సిఇఓ ఎలోన్ మస్క్
Elon Musk : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రపంచ కుబేరులలో టాప్ లో ఉన్నారు. ఇటీవలే సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను భారీ ధరకు కొనుగోలు చేశారు.
ఈ సందర్బంగా ఆయన నిత్యం వార్తల్లో ఉంటూ వస్తున్నారు. వరుస స్వీట్లతో దుమ్ము రేపుతున్నారు. ఇదిలా ఉండగా తాను చూసిన అద్భుతాలలో భారత దేశంలోని ఆగ్రాలో నిర్మించిన తాజ్ మహల్ ఒకటి అని ప్రశంసలతో ముంచెత్తారు.
నిజంగా దాని అందం ప్రపంచంలోనే మహా అద్భుతం అంటూ పేర్కొన్నారు. ఆగ్రా కోట నిర్మాణం ప్రతి ఒక్కరు చూసి తరించాలని, ఆ వండర్ ను తాను చూసి ఆశ్చర్యానికి లోనైనట్లు తెలిపారు ఎలోన్ మస్క్(Elon Musk).
ప్రపంచ అద్భుతాలలో, వింతల్లో తాజ్ మహల్ ఒకటి అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలోన్ మస్క్(Elon Musk) చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా తాను 2007లో తాజ్ మహల్ ను సందర్శించానని తెలిపారు.
ఇది మరిచి పోలేని జ్ఞాపకమని పేర్కొన్నారు. ఆగ్రా కోటను తెలియ చేసేలా ఫోటో ను కూడా షేర్ చేశారు. ట్విట్టర్ లో ఆయన చేసిన ట్వీట్ హోరెత్తిస్తోంది. దీంతో టెస్లా సిఇఓ భారత సందర్శ గురించి ఊహాగానాలకు తెర లేపారు.
ఇదిలా ఉండగా పే టీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ ఒక ప్రశ్న కూడా వేశారు. మిస్టర్ మస్క్ మొదటి టెస్లాను డెలివరీ చేసేందుకు ఎప్పుడు సందర్శిస్తారంటూ ట్వీట్ చేశారు.
Also Read : ట్విట్టర్ ఫ్యూచర్ పై ఎలోన్ మస్క్ కామెంట్