Elon Musk : చెత్త‌ను తొల‌గించా స‌త్తా ఉన్నోళ్ల‌ను తీసుకుంటా

ట్విట్ట‌ర్ కొత్త బాస్ ఎలాన్ మ‌స్క్ ప్ర‌క‌ట‌న

Elon Musk : టెస్లా చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్ మ‌స్క్ మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. ఇప్ప‌టి దాకా ట్విట్ట‌ర్ లో ఉన్న చెత్త‌ను తొల‌గించాన‌ని ప్ర‌క‌టించాడు. ఆపై కొత్త వారిని తీసుకుంటాన‌ని వెల్ల‌డించాడు. ఇదే స‌మ‌యంలో ట్విట్ట‌ర్ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని టెక్సాస్ కు త‌ర‌లించే త‌క్ష‌ణ ప్లాన్ ఏమీ ఇప్ప‌టికి లేద‌ని స్ప‌ష్టం చేశాడు.

చాలా మటుకు తాను ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ చేసుకున్నాక ఎవ‌రు ఉండాలో ఎవ‌రు ఉండ కూడ‌ద‌ని తాను ఓ అంచ‌నాకు వ‌చ్చాన‌ని తెలిపాడు. ఇదే స‌మ‌యంలో అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చుతో పాటు పెద్ద ఎత్తున ఉన్న భారాన్ని కూడా తొల‌గించాన‌ని పేర్కొన్నాడు. దీని వ‌ల్ల కంపెనీపై అద‌న‌పు భారం ప‌డ‌ద‌న్నాడు.

ఇదే క్ర‌మంలో వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ కు తాను వ్య‌తిరేకం అని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. అందుకే ఎవ‌రైనా స‌రే ఆఫీసుల‌కు రావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. వ్య‌వ‌స్థ లేదా సంస్థ వృద్ది లోకి రావాలంటే ముందు అద‌న‌పు ఖ‌ర్చులు త‌గ్గించు కోవాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌న్నారు.

తాను కూడా ఇదే చేశాన‌ని కానీ కొంద‌రు త‌న‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కీల‌క మార్పులు , సంస్క‌ర‌ణ‌లు మున్ముందు ట్విట్ట‌ర్ లో కొనసాగుతాయ‌ని వెల్ల‌డించాడు ఎలాన్ మ‌స్క్(Elon Musk). బ‌య‌ట జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరాడు. ఇదే స‌మ‌యంలో యావ‌త్ ప్ర‌పంచం ట్విట్ట‌ర్ లో ఏం జ‌రుగుతుందోన‌ని చూస్తోంద‌న్నాడు.

అందుకే తాను ట్విట్ట‌ర్ ను గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని చెప్పాడు. ఇదే స‌మ‌యంలో తొల‌గింపులు దాదాపు పూర్త‌యిన‌ట్లేన‌ని కొత్త వారిని తీసుకుంటామ‌న్నాడు.

Also Read : ట్విట్ట‌ర్ లో కొన‌సాగుతున్న కొలువుల కోత

Leave A Reply

Your Email Id will not be published!