Elon Musk vs CEO : ఎలోన్ మస్క్ వర్సెస్ పరాగ్ అగర్వాల్
ట్విట్టర్ పై ఆధిపత్యం ఎవరిది
Elon Musk vs CEO : ప్రపంచ కుబేరుడు, టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ ఎప్పుడైతే ట్విట్టర్ పై కన్నేశాడో ఆనాటి నుంచి సంస్థ సిఇఓ(Elon Musk vs CEO) ప్రవాస భారతీయుడైన పరాగ్ అగర్వాల్ పట్ల ఒకింత గుర్రుగా ఉన్నారు.
ప్రధానంగా ట్విట్టర్ యాజమాన్యంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీనిని తీవ్రంగా తప్పు పడుతూ వచ్చారు సిఇఓ. ఇదే సమయంలో ఎలోన్ మస్క్ $44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించాడు.
ఇక ఆనాటి నుంచి ట్విట్టర్ ను టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. విపరీతమైన జోక్యాన్ని సహించే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు మాజీ సిఇఓ, ఫౌండర్ తో పాటు ప్రస్తుత సిఇఓ అగర్వాల్. ప్రస్తుతం ఎలోన్ మస్క్ వర్సెస్ పరాగ్ అగర్వాల్(Elon Musk vs CEO) ల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.
చివరకు ఒకరిపై మరొకరు ట్వీట్లు చేసుకునేంత దాకా వెళ్లింది. తాజాగా ఫేక్, స్పామ్స్ అకౌంట్స్ పై తనకు క్లారిటీ రావాలని లేక పోతే తాను కొనుగోలు చేసే ప్రసక్తి లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు ఎలోన్ మస్క్ .
దీనిపై సీరియస్ గా స్పందించాడు పరాగ్ అగర్వాల్. ఇదిలా ఉండగా ట్విట్టర్ తన వశం కావాలంటే ఇంకా ఆరు నెలల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసినా పరాగ్ అగర్వాల్ ఎక్కడా తగ్గడం లేదు.
ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్లు 5 శాతానికి మించి ఉండవంటూ యాజమాన్యం వెల్లడించింది. దీనిపై సంతృప్తి చెందలేదు ఎలోన్ మస్క్. దీనిపై స్పష్టత రాక పోతే తాను టేకోవర్ చేసుకునే విషయంలో ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరించాడు.
ట్విట్టర్ కొనుగోలు డీల్ ను హోల్డ్ లో పెడుతున్నట్లు ప్రకటించాడు. కావాలని సిఇఓను మస్క్ అనుమానిస్తున్నాడంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
Also Read : అతి పెద్ద సిమెంట్ వాటాదారుగా అదానీ గ్రూప్