Lata Mangeshkar Cremation : లోకాన్ని వీడిన కోయిల‌మ్మ

అల్విదా ల‌తా మంగేష్క‌ర్

Lata Mangeshkar Cremation : ఆ స్వ‌రం దైవ స్వ‌రూపం. ఆ గాత్రం అజ‌రామం. ఆ మోము చెర‌గ‌ని జ్ఞాప‌కం. సుదీర్ఘ కాలం పాటు భార‌తీయ సినీ సంగీత ప్ర‌స్థానంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక మైన స్థానం ఏర్ప‌ర్చుకున్న పాట‌ల కోయిల‌మ్మ ల‌తా మంగేష్క‌ర్(Lata Mangeshkar Cremation) ఇక సెల‌వంటూ ఈ లోకాన్ని వీడింది.

20కి పైగా భాష‌లు. 30 వేల‌కు పైగా పాట‌లు ఆమె మృధు మ‌ధుర‌మైన గొంతులోంచి జాలు వారాయి.

ఒక‌టా రెండా వేలాది పాట‌లు ఇప్ప‌టికీ ఎక్క‌డో ఒక చోటు పెదవుల మీద త‌చ్చ‌ట్లాడుతూనే ఉంటాయి.

ప్రేమ పూర్వ‌క‌మైన ప‌ల‌క‌రింపు. క‌ల్మ‌షం అంట‌ని మాన‌వ‌త నింపుకున్న ఆ గాత్ర సౌర‌భం ధూపంలా కోట్లాది ప్ర‌జ‌ల‌ను చుట్టేసింది. లోకాన్ని అంత‌టా ప‌రుచుకుంది.

క‌రోనా మ‌హ‌మ్మారి ఉన్న‌ప్ప‌టికీ గాన కోకిల చివ‌రి చూపు కోసం ముంబై మ‌హా న‌గ‌రం జ‌న‌సంద్ర‌మైంది.

చిన్నారుల నుంచి పెద్ద‌ల దాకా, ప్ర‌ముఖుల నుంచి పొలిటిక‌ల్ లీడ‌ర్ల దాకా వేలాది మంది త‌ర‌లి వ‌చ్చారు.

మ‌రోసారి శివాజీ స్టేడియం కిక్కిరిసి పోయింది. ఆమె జ్ఞాప‌కార్థం, గౌర‌వార్థం భార‌త ప్ర‌భుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్ర‌క‌టించింది. ఒక గాయ‌నికి ద‌క్కిన అరుదైన పుర‌స్కారం ఇది.

లెక్కించ‌లేని అవార్డులు..గుర్తు పెట్టుకోన‌న్ని పుర‌స్కారాలు. బ‌తుకు బరువు మోసేందుకు 13 ఏళ్ల‌కే పాడటం

ప్రారంభించిన ల‌తా మంగేష్క‌ర్(Lata Mangeshkar Cremation) కు ఆయా దేశాలు అవార్డుల‌తో స‌త్క‌రించాయి.

త‌మ‌ను తామ‌ను గౌర‌వించుకున్నాయి. త‌న‌కు గౌర‌వం ద‌క్క‌డం అంటే ఆ పుర‌స్కారానికి ల‌భించిన గుర్తింపుగా భావించాయి సంస్థ‌లు.

137 కోట్ల‌కు పైగా కొలువు తీరిన భార‌తావ‌నికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స్వ‌చ్చంధంగా ల‌తా మంగేష్క‌ర్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు.

దేశ రాష్ట్ర‌ప‌తి కోవింద్ నుంచి దేశ‌మంత‌టా క‌న్నీటి సంద్ర‌మైంది ల‌తా దీదీ కోసం. ఈ గాన గంధ‌ర్వ గాత్రం ఎల్ల‌ప్ప‌టికీ త‌న మాధుర్యాన్ని పంచుతూనే ఉంటుంది.

పాట‌ల‌తో ప‌ల‌వ‌రించేలా చేస్తూనే ఉంటుంది. యావ‌త్ భార‌తావ‌ని సైతం విన‌మ్రంగా గాన కోకిల‌కు వీడ్కోలు ప‌లికింది. అల్విదా ల‌తాజీ.

Also Read : గాత్ర మాధుర్యం అజ‌రామ‌రం

Leave A Reply

Your Email Id will not be published!