Amit Shah : ఉగ్రవాదం అంతం అభివృద్దికి అందలం
స్పష్టం చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి
Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు. మణిపూర్ లో ఒకప్పుడు ఉగ్రవాదం, నిత్యం ఆందోళనలు, నిరసనలు, బంద్ లతో ఉండేది. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదన్నారు. వాటన్నింటి నుంచి మణిపూర్ రాష్ట్రానికి విముక్తి కల్పించిన ఘనత తమదేనని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
ఇప్పుడు అభివృద్ది మాత్రమే ఉండేలా చేశామన్నారు. అన్ని రంగాలలో మణిపూర్ ను ముందంజలో నిలిపేందుకు శాయ శక్తులా ప్రయత్నం చేస్తామని చెప్పారు అమిత్ చంద్ర షా(Amit Shah). కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలలో ఈశాన్య ప్రాంతంలో ఏకంగా రూ. 3.45 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని చెప్పారు.
ఈ కాలంలో ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఈ ప్రాంతాన్ని ఏకంగా 51 సార్లు సందర్శించారని స్పష్టం చేశారు అమిత్ షా. మణిపూర్ లోని ఇంఫాల్ లో దాదాపు రూ. 300 కోట్ల విలువైన 12 ప్రాజెక్టులను కేంద్ర మంత్రి ప్రారంభించారు. రూ. 1,007 కోట్ల విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపన చేశారు.
అనంతరం బిష్ణుపూర్ జిల్లా లోని మొయిఆంగ్ లో జరిగిన బహిరంగ ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా(Amit Shah) ప్రసంగించారు. అంతే కాకుండా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం 1958ని ఎత్తి వేసిందని చెప్పారు. మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీ హయాంలో భయానక వాతావరణం ఉండేదన్నారు. ఇప్పుడు తాము వచ్చాక చిన్న రాష్ట్రాలలో పాలనా పరంగా టాప్ లో మణిపూర్ నిలిచిందని కొనియాడారు.
Also Read : ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా