PM Narendra Modi : ఇంధ‌న రంగానిదే భ‌విష్య‌త్తు – మోదీ

ఆవిష్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం పెద్ద‌పీట

PM Narendra Modi : రాబోయే భ‌విష్య‌త్తు అంతా ఇంధ‌న రంగానికే అవుతుంద‌ని అన్నారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. క‌ర్ణాట‌క లోని బెంగ‌ళూరులో జ‌రుగుతున్న ఇండియా ఎనర్జీ వీక్ 2023 స‌ద‌స్సును సోమ‌వారం ప్రారంభించారు. ఇండియ‌న్ ఆయిల్ అభివృద్ది చేసిన సోలార్ కుకింగ్ సిస్ట‌మ్ ట్విన్కుక్ టాప్ మోడ‌ల్ ను మోదీ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు.

త‌మ ప్ర‌భుత్వం ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్ర‌యారిటీ ఇస్తున్న‌ద‌ని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి(PM Narendra Modi). ప్ర‌తి ఒక్క‌రికీ ప్రాధాన్య‌త ఇస్తూ వారిని ప్రోత్స‌హిస్తున్న‌ట్లు తెలిపారు. 21వ శ‌తాబ్దంలో ప్ర‌పంచ భ‌విష్య‌త్తును నిర్ణ‌యించ‌డంలో ఇంధ‌న రంగం కీల‌క‌మైన పాత్ర పోషిస్తుంద‌ని అన్నారు. శ‌క్తి ప‌రివ‌ర్త‌న రంగంలో ప్ర‌పంచంలోనే భార‌త్ నెంబ‌ర్ 1గా ఉంద‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ.

ప్ర‌స్తుతం భార‌త్ జీ20 గ్రూప్ కు నాయ‌కత్వం వ‌హిస్తోంద‌ని, ఇందులో భాగంగా నిర్వ‌హిస్తున్న మొద‌టి యూనిట్ ఇదేన‌ని పేర్కొన్నారు. ఇండియా ఎన‌ర్జీ వీక్ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకున్న ప్ర‌తి ఒక్క‌రిని ఈ సంద‌ర్బంగా అభినందిస్తున్న‌ట్లు చెప్పారు. బెంగ‌ళూరు న‌గ‌రం సాంకేతిక‌త‌కు, క‌నెక్టివిటికీ, ఇంధ‌న, విమాన‌యాన‌, కోల్ కు ప్ర‌సిద్ది చెందింద‌ని కొనియాడారు న‌రేంద్ర మోదీ.

దేశంలో యువ‌త ఎక్కువ‌గా ఆవిష్క‌ర‌ణ‌ల‌పై ఫోక‌స్ పెడుతోంద‌ని వారు మ‌రిన్ని ఆవిష్క‌ర‌ణ‌లు రూపొందించేలా కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. భార‌త దేశం ఎన్నో స‌వాళ్ల‌ను ఇప్ప‌టికే ఎదుర్కొంద‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ. ఇక్క‌డ స్థిర‌మైన , నిర్ణ‌యాత్మ‌క ప్రభుత్వం ఉంద‌న్నారు. అట్ట‌డుగు స్థాయిలో సామాజిక‌, ఆర్థిక సాధికార‌త అనే మూడు అంశాల‌పైనే తాము ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌న్నారు.

Also Read : ట‌ర్కీకి స‌హాయం చేస్తాం – న‌రేంద్ర మోదీ

Leave A Reply

Your Email Id will not be published!