Sanjay Raut Ed Summons : సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు
మంగళవారం హాజరు కావాల్సిందే
Sanjay Raut Ed Summons : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో శివసేన పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్నారు డైనమిక్ లీడర్ , రాజ్యసభ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్. దీంతో కేంద్ర సర్కార్ ను ఆయన తప్పు పడుతూ వస్తున్నారు.
బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఇదే సమయంలో ఆయన ఉద్దవ్ ఠాక్రేకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు.
అంతే కాదు ఆ పార్టీ గొంతుక అయిన సామ్నా పత్రికకు గౌరవ సంపాదకుడు కూడా. ఇప్పుడు మొత్తం రాజకీయమంతా సంజయ్ రౌత్ వర్సెస్ ఏక్ నాథ్ షిండే మధ్య నడుస్తోంది.
ఈ తరుణంలో ఉన్నట్టుండి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షాక్ ఇచ్చింది. ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut Ed Summons) కు సమన్లు జారీ చేసింది. ఈనెల 28న తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది.
ఇదిలా ఉండగా ఇదంతా ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల ప్లాన్ ప్రకారం ఈడీ, సీబీఐ, కేంద్ర సంస్థల ఒత్తిడి మేరకు ఇదంతా జరుగుతోందని శివసేన వర్గం ఆరోపిస్తోంది.
కాగా రూ. 1,034 కోట్ల పట్రా చాల్ ల్యాండ్ స్కామ్ కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆ సమయంలో రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. నేను భయపడే వాడిని కాదు.
నా ఆస్తిని స్వాధీనం చేసుకోండి. నన్ను కాల్చండి లేదా జైలుకు పంపండి అంటూ నిప్పులు చెరిగారు. సంజయ్ రౌత్ బాలా సాహెబ్ ఠాక్రే అనుచరుడు. శివ సైనికుడంటూ హెచ్చరించారు.
ఈడీ ఒత్తిడితో పార్టీని వీడిన వాడు బాలా సాహెబ్ భక్తుడు కానే కాదన్నాడు.
Also Read : షిండే గ్రూప్ లో చేరిన మంత్రి సామంత్