ENG vs PAK ICC ODI World Cup : వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్
ఇంగ్లండ్ చేతిలో పరాజయం
ENG vs PAK ICC ODI World Cup : ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ 2023 నుంచి దాయాది పాకిస్తాన్ నిష్క్రమించింది. కీలకమైన మ్యాచ్ లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో కీవీస్ దర్జాగా సెమీ ఫైనల్ కు చేరుకుంది. భారత జట్టుతో ఈనెల 15న తాడో పేడో తేల్చుకోనుంది. ఇక ఆస్ట్రేలియా కూడా జైత్రయాత్ర సాగింది.
ENG vs PAK ICC ODI World Cup Updates
ఎలాగైనా సరే పాకిస్తాన్ గెలుస్తుందని , భారత్ తో పోటీ పడుతుందని అంతా భావించారు. కానీ పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లింది ఇంగ్లండ్. అద్బుతమైన పోరాట పటిమను కనబర్చింది. దీంతో దాయాదులు తలవంచక తప్పలేదు.
ఏదో అద్భుతం జరుగుతుందని, దాయాదులు పోటీ పడుతారని అనుకున్నారంతా. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఇంగ్లండ్ ఆట ముందు పాక్ తేలి పోయింది. కోల్ కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఆసక్తిని రేపింది. బాబర్ టీంకు కోలుకోలేని షాక్ తగిలింది.
భారీ స్కోర్ పాకిస్తాన్ ముందు ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 338 రన్స్ లక్ష్యం నిర్దేశించింది. విచిత్రం ఏమిటంటే కేవలం 6.4 ఓవర్లలోనే ఈ భారీ టార్గెట్ ఛేదిస్తేనే సెమీస్ కు చేరుకునేది. 2 వికెట్లు కోల్పోయి 30 రన్స్ చేసింది. దీంతో పాకిస్తాన్ చేతులెత్తేసింది..ఇంటి బాట పట్టింది.
Also Read : ICC ODI World Cup Semis : సెమీస్ బెర్తులు ఖరారు