ENGW vs SAW T20 : రెండో సెమీస్ లో సఫారీ బిగ్ స్కోర్
ఇంగ్లండ్ టార్గెట్ 165 రన్స్
ENGW vs SAW T20 : దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టి20 వరల్డ్ కప్ లో ఇవాళ రెండో సెమీ ఫైనల్ ఇంగ్లండ్ , దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోంది. మొదటి సెమీ ఫైనల్ ఫిబ్రవరి 23న ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగింది. టీమిండియా చివరి దాకా పోరాడింది. కేవలం 5 పరుగుల తేడాతో ఓడి పోయింది. ఇక శుక్రవారం రెండో సెమీస్ ప్రారంభమైంది. ముందుగా బ్యాటింగ్ కు దిగింది ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా(ENGW vs SAW T20). నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 4 వికెట్లు కోల్పోయి 164 రన్స్ చేసింది.
ఇంగ్లండ్ ముందు 165 రన్స్ టార్గెట్ ఉంచింది. టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొన్నాయి. ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్ లు ఆడాయి. చివరకు భారత్ ,ఆసిస్ , సౌతాఫ్రికా, ఇంగ్లండ్ నిలిచాయి. చివరకు ఇవాల్టితో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ కు ఎవరు చేరుకుంటారనే దానిపై తేలి పోతుంది. ఇప్పటికే అటు ఇంగ్లండ్ ఇటు ఆసిస్ టైటిల్ ఫెవరేట్ లుగా నిలిచాయి.
ఇక ఆసిస్ నేరుగా ఫైనల్ కు చేరుకుంది. ఇక సఫారీలు అడ్డుకట్ట వేస్తారా లేదా చూడాలి. సఫారీ జట్టులో లారా వోల్వార్డ్ హాఫ్ సెంచరీ చేసింది. టాజ్మిన్ బ్రిట్స్ తో ఓపెనింగ్ స్టాండ్ ఏకంగా 96 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా 140 రన్స్ దాటలేదు. కానీ 164 పరుగులు చేయడం విశేషం.
ఇదిలా ఉండగా కడపటి వార్తలు అందేసరికల్లా ఇంగ్లండ్ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 40 రన్స్ చేసింది. ఎంత భారీ స్కోర్ సాధించినా దానిని ఛేదించడం అలవాటుగా మార్చుకుంది ఇంగ్లండ్.
Also Read : తల్లికి అనారోగ్యం కెప్టెన్సీకి దూరం