Election Results : ప్ర‌జా తీర్పుపై టెన్ష‌న్ టెన్ష‌న్

ఓట్ల లెక్కింపు ప్రారంభం

Election Results : యావ‌త్ దేశ‌మంతా ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై (Election Results)టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై చ‌ర్చోప చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కానీ చెప్ప‌లేం ఆయా రాష్ట్రాల‌లో ఏ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌నేది చెప్ప‌లేం.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మొద‌ట పోస్ట‌ల్ బ్యాలెట్లు లెక్కించారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. 144 సెక్ష‌న్ విధించారు.

భారీ ఎత్తున సిబ్బంది త‌ల‌మున‌క‌లై ఉన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వ‌ద్ద వెబ్ కాస్ట్ ను ఏర్పాటు చేశారు. స‌మాజ్ వాది పార్టీ బీజేపీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. ఈవీఎంల‌ను టాంప‌రింగ్ చేసే ఛాన్స్ ఉందంటూ ఆరోపించింది.

దీంతో ఈసీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఇక ఐదు రాష్ట్రాల‌కు సంబంధించి ఇప్ప‌టికే దేశంలోని ప్రధాన స‌ర్వే సంస్థ‌లు, ఆయా ఛాన‌ళ్ల‌కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా బీజేపీకి ఎడ్జ్ ఉన్న‌ట్లు తేల్చాయి.

విచిత్రం ఏమిటంటే పంజాబ్ లో ఆప్ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని పేర్కొన్నాయి. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే అతి ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రంలో దేశంలోనే ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి పేరుంది. ఇక్క‌డ 403 స్థానాలు ఉన్నాయి.

మ్యాజిక్ ఫిగ‌ర్ అధికారంలోకి రావాలంటే 202 సీట్లు రావాల్సి ఉంది. 2017 ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజారిటీ సాధించింది బీజేపీ. ఇప్పుడు ఎస్పీతో గ‌ట్టి పోటీ ఎదుర్కొంటోంది.

ఇక ఉత్త‌రాఖండ్ లో ఈసారి బీజేపీకి ఎదురు దెబ్బ త‌గిలేలా ఉంది. గోవాలో బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ గా మారింది. ఇక పంజాబ్ లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గ‌ట్టి పోటీని ఎదుర్కొంటోంది.

మ‌ణిపూర్ లో కాంగ్రెస్, బీజేపీ మ‌ధ్య న‌డుస్తోంది. ఏది ఏమైనా పోస్ట‌ల్ బ్యాలెట్ ల‌లో ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్టుగానే రావ‌డం విశేషం.

Also Read :   కేజ్రీవాల్ దేశానికి కాబోయే ప్ర‌ధాని

Leave A Reply

Your Email Id will not be published!