Prashant Kishor : దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు (Elections) ముగిశాయి. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో మరోసారి భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) సత్తా చాటింది. ఇక ఉన్న అధికారాన్ని పంజాబ్ లో కాంగ్రెస్ (Congress) పోగొట్టుకుంది.
అప్పనంగా ఆప్ కు ఇచ్చేసింది. ఈ తరుణంలో ఎన్నికల పర్వం ముగిశాక ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor)స్పందించారు. ఆయన ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికల సరళిని విశ్లేషించారు.
సమాజ్ వాది పార్టీ ఎందుకు ఓడి పోయిందో, ఎక్కడ గ్యాప్ ఏర్పడిందో, బీజేపీ ఎందుకు హవా చెలాయించిందో స్పష్టంగా వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ త్రయం ( అమిత్ షా, జేపీ నడ్డా ) పకడ్బందీగా ఎన్నికలను ఉపయోగించుకుందని స్పష్టం చేశారు.
కానీ సమాజ్ వాది పార్టీకి ఛాన్స్ ఉన్నా వ్యూహంలో వెనుకంజ వేసిందని పేర్కొన్నారు. పోల్ మేనేజ్ మెంట్, స్ట్రాటజీ అన్నది ఎన్నికల సమయంలో కీలకంగా మారుతాయని స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్ (ప్రశాంత్ కిషోర్).
బలంగా పాతుకు పోయిన మోదీని, సీఎం యోగిని ఢీకొనేందుకు ఎలాంటి ప్లాన్ వర్కవుట్ చేయక పోవడం వల్లే ఎస్పీ ఓటమి పాలైందని కుండబద్దలు కొట్టారు.
యూపీ సర్కార్ ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షం నుంచి ఒక్క నేతను ముందుకు తీసుకు రాలేక పోయారని మండిపడ్డారు పీకే. ప్రచారంలో సైతం బీజేపీ కంటే వెనుకంజలో ఉండడం కూడా ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ఆ రాష్ట్రంలో ఎస్పీ బలమైన పార్టీ కానీ ఎన్నికల్లో చేజేతులారా ఉన్న అవకాశాన్ని పోగొట్టుకుందన్నారు.
Also Read : ఆశిష్ మిశ్రా కేసుపై ప్రత్యేక బెంచ్