Essay Competition: ఆపరేషన్ సిందూర్ పై ‘వ్యాసరచన’ పోటీ
ఆపరేషన్ సిందూర్ పై ‘వ్యాసరచన’ పోటీ
Essay Competition : పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన సంగతి తెలిసిందే. దీనితో ఆపరేషన్ సిందూర్ దెబ్బకి పాకిస్తాన్ కకావికలమయింది. దీనితో ఆపరేషన్ సిందూర్ పై ప్రపంచ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ఈ క్రమంలో ‘ఆపరేషన్ సిందూర్’ రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ ఆపరేషన్ కు సంబంధించి యువత మనసులోని భావాలను వినిపించేందుకు ఓ అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆన్లైన్లో వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
Essay Competition on ‘Operation Sindoor’
జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ వ్యాసరచన పోటీ(Essay Competition) అందుబాటులో ఉంటుంది. ఒకరు ఒకేసారి పాల్గొనవచ్చు. ఇంగ్లిష్, హిందీ భాషల్లో రాసేందుకు మాత్రమే వీలుంది. 500 నుంచి 600 పదాల్లోనే ఉండాలి. ఇందులో ముగ్గురు విజేతలకు రూ.10వేల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. దీనితోపాటు టాప్ లో నిలిచిన 200 మందికి (వీరికి తోడుగా మరొకరికి) ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. ఇందుకోసం mygov.in లో లాగిన్ అయ్యి వ్యాసరచన పోటీల్లో పాల్గొనవచ్చు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో సుమారు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీటితోపాటు పలు పాక్ వైమానిక స్థావరాలను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సరికొత్త పంథాతో పాక్ ఉగ్రవాదానికి ఒక ‘రెడ్‌లైన్’ గీశామని ఉద్ఘాటించారు.
Also Read : Brahmaputra Floods: ఈశాన్య రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు ! ‘డేంజర్’ లెవల్ లో బ్రహ్మపుత్ర !
