Ramanujacharya : అన్ని దారులు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి కొలువు తీరిన ముచ్చింతల్ వైపు పరుగులు తీస్తున్నాయి. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.
వెయ్యి కోట్లు దీని కోసం వెచ్చించారు. ఈ ఆశ్రమం 40 ఎకరాలలో కొలువై ఉంది.
216 అడుగులతో రామానుజాచార్యుల విగ్రహాన్ని నిర్మించారు. 14 వరకు కార్యక్రమాలు జరుగుతాయి. 5న ప్రధాని ప్రారంభిస్తారు.
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు దగ్గరలో ఉంది. ఇప్పటి దాకా బ్యాంకాక్ లోని 302 అడుగుల ఎత్తులో ఉన్న బుద్దుడి విగ్రహం మొదటిది కాగా రెండోది తెలంగాణలో కొలువు తీరింది.
ఇక గుజరాత్ లోని నర్మదా నది ఒడ్డున భారత దేశపు మొదటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సంబంధించి 597 అడుగులతో నిర్మాణం కాబోతోంది.
ఒక వేళ అది ప్రారంభమైతే బుద్దుడి విగ్రహం రెండో ప్లేస్ , రామానుజుడి స్టాట్యూ మూడో స్థానానికి వెళుతుంది.
తెలంగాణకే ఈ విగ్రహం తలమానికం కాబోతోంది. వైష్ణవ సన్యాసిగా శ్రీ రామానుజాచార్యుడిని(Ramanujacharya) పేర్కొంటారు.
సమతామూర్తి అని పిలిచే ఈ ప్రాంగణం ఇప్పుడు చరిత్ర సృష్టించేందుకు సిద్దమవుతోంది. 1017లో శ్రీ రామానుజుడు జన్మించాడు.
ఇది 1,000వ వార్షికోత్సవం. ఉత్సవాల్లో భాగంగా రూ. 1,000 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేశారు.
ఇక సమతామూర్తి 120 సంవత్సరాల జీవితంలో ఎక్కువ భాగం హిందూ తత్వశాస్త్రాన్ని ప్రచారం చేయడం కోసం వెచ్చించారు.
కులం, వర్ణం, మతం పేరుతో వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన రామానుజుడు(Ramanujacharya).
సర్వ శక్తిమంతుడు అన్ని జీవులలో ఉన్నాడని ప్రతిపాదించారు. ఇక 216 అడుగుల విగ్రహాన్ని పంచలోహంతో తయారు చేశారు. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, తగరం, సీసం మిశ్రమం ఇందులో ఉంది.
చైనాలోని ఏరోసన్ కార్పొరేషన్ ఈ విగ్రహాన్ని నిర్మించింది. 60 మంది నిపుణుల బృందం విగ్రహ నిర్మాణంలో పాలు పంచుకుంది. విగ్రహం ఖరీదు రూ. 100 కోట్టు. ప్రభుత్వానికి దిగుమతి సుంకం కింద రూ. 32 కోట్లు చెల్లించినట్లు ఆశ్రమ నిర్వాహకులు వెల్లడించారు.
మొత్తంగా సమతామూర్తి విగ్రహం చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యింది.
Also Read : సమతా మూర్తికి సమున్నత గౌరవం