Etela Rajender : కేసీఆర్ పై ఈటల పోటీ
రెండు చోట్ల యుద్దానికి రెడీ
Etela Rajender : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు పార్టీ పరంగా తెలంగాణలో పోటీ చేసే స్థానాలకు సంబంధించి అభ్యర్థులను వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే బీఆర్ఎస్ లో కీలకమైన నాయకుడిగా , మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్(Eatala Rajender) ఉన్నట్టుండి కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన వామపక్ష భావజాలం కలిగిన వ్యక్తి. కేసీఆర్ తర్వాత నెంబర్ 2గా వెలుగొందాడు.
Etela Rajender Participation Viral
ఆ తర్వాత భూములను ఆక్రమించాడనే నెపంతో ఈటలపై వేటు వేశాడు కేసీఆర్. ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేశాడు. దమ్ముంటే తనపై గెలవాలని సవాల్ విసిరాడు. ఆపై ఎవరూ ఊహించని రీతిలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈటల రాజేందర్ తను దమ్మున్న లీడర్ నని నిరూపించాడు. ఆపై హుజూరాబాద్ లో గ్రాండ్ విక్టరీని నమోదు చేశాడు.
తాజాగా సంచలన ప్రకటన చేశాడు ఈటల రాజేందర్ . ఈ సారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై నిలబడతానని ప్రకటించాడు. తాను ఎక్కడ నిలబడితే అక్కడ బరిలో ఉంటానని, తప్పక ఓడిస్తానని స్పష్టం చేశాడు. తను అనుకున్నట్టుంగానే త్వరలో జరగబోయే ఎన్నికల్లో గజ్వేల్ తో పాటు హుజూరాబాద్ లో కూడా పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ కూడా రెండు చోట్ల టికెట్లు ఇచ్చింది రాజేందర్ కు.
Also Read : AP Governor Visit : తిరుమల సన్నిధిలో గవర్నర్