Etela Rajender : ఎప్పుడు పోతానా అని చూస్తున్నారు
ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్
Etela Rajender : బీజేపీ సీనియర్ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పరోక్షంగా పార్టీపై తీవ్రంగా మాట్లాడారు. ఒక రకంగా ఆయన మాటల్లో అసహనం వ్యక్తమైంది. ఇటీవల కొంత కాలంగా మౌనంగా ఉన్నారు. తాజాగా ఈటల రాజేందర్, మరో సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్టీ ముందు పడిగాపులు కాశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
ఈ తరుణంలో ఉన్నట్టుండి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ కు వెంటనే రావాలంటూ హై కమాండ్ నుండి పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఉన్న పళంగా హస్తినకు వెళ్లారు. ఇదే క్రమంలో ఈటల, కోమటిరెడ్డి పార్టీని వీడనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ షాకింగ్ కామెంట్స్ చేశారు ఈటల రాజేందర్(Etela Rajender). మా భారతీయ జనతా పార్టీలో తాను ఎప్పుడు వెళ్లి పోతానా అని కొందరు ఎదురు చూస్తున్నారంటూ పేర్కొన్నారు.
రాజేందర్ మీడియాతో మాట్లాడారు. నన్ను వెళ్లిపో అనే వాళ్లు కూడా ఉన్నారని వాపోయారు. తనను అవమానించే వాళ్లు కూడా లేక పోలేదన్నారు. వాళ్లు ఎవరో కూడా అందరికీ తెలుసు అని స్పష్టం చేశారు ఈటల రాజేందర్. దీంతో ప్రస్తుతం మాజీ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉద్యమకారుడిగా, టీఆర్ఎస్ లో కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. మంత్రిగా చేశారు. కేసీఆర్ తో పడక బయటకు వచ్చారు. ఆ తర్వాత కమల తీర్థం పుచ్చుకున్నారు. చివరకు దాని పట్ల కూడా అసంతృప్తితో ఉన్నారు.
Also Read : Adipurush Record : ఆది పురుష్ వసూళ్లలో అదుర్స్