Arundhati Roy : అరుంధ‌తీ రాయ్ కి అరుదైన పుర‌స్కారం

జీవిత సాఫ‌ల్యానికి యూరోపియ‌న్ ఎస్సే అవార్డ్

Arundhati Roy : ప్ర‌ముఖ భార‌తీయ ర‌చ‌యిత్రి అరుంధ‌తీ రాయ్ కి అంత‌ర్జాతీయ స్థాయిలో పుర‌స్కారం ల‌భించింది. జీవిత‌కాల సాఫ‌ల్యానికి యూరోపియ‌న్ ఎస్సే బ‌హుమ‌తి ద‌క్కింది. అరుంధ‌తీ రాయ్ 2021 సంవ‌త్స‌రంలో ఆజాది పేరుతో వివిధ అంశాల‌కు సంబంధించి వ్యాసాలు రాశారు. దీనిని పుస్త‌కంగా ప్ర‌చురించారు. ఫ్రెంచ్ అనువాదానికి బ‌హుమ‌తి పొందారు అరుంధ‌తీ రాయ్.

ర‌చ‌యిత్రికి 45వ యూరోపియ‌న్ బ‌హుమ‌తి ల‌భించింది. ఈ విష‌యాన్ని చార్లెస్ వీలాస్ ఫౌండేష‌న్ అధికారికంగా ప్ర‌క‌టించింది. యావ‌త్ ప్ర‌పంచం ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటోంది. దైనందిన జీవితంలో ఎదుర‌య్యే అనేక స‌వాళ్ల‌ను అరుంధ‌తీ రాయ్(Arundhati Roy) త‌న క‌లం ద్వారా వెలుగులోకి తీసుకు వ‌చ్చేలా చేసింద‌ని ఫౌండేష‌న్ వెల్ల‌డించింది.

ప్ర‌పంచాన్ని భ‌యకంపితుల్ని చేస్తూ వ‌స్తున్న ఉగ్ర‌వాదం , ఫాసిజం గురించి అది చేసే దాష్టీకాల‌ను, మార‌ణ హోమాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు రాశారంటూ కితాబు ఇచ్చింది. ఎంద‌రో జీవితాల‌ను ప్ర‌భావితం చేసేలా వ్యాసాలు ఉన్నాయంటూ పేర్కొంది.

అజాది అనే పేరు కూడా స‌రిగ్గా స‌రి పోయిందంటూ తెలిపింది ఫౌండేష‌న్. ఎలాంటి క‌ల్పితాలు లేకుండా వాస్త‌వాల ప్రాతిప‌దిక‌న ప్ర‌తింబించేలా ఉన్నాయ‌ని ప్ర‌శంసించింది. కాగా ఇప్ప‌టికే అరుంధ‌తీ రాయ్ ఎన్నో జాతీయ‌, అంత‌ర్జాతీయ పుర‌స్కారాల‌ను అందుకున్నారు. ఆమె రాసిన ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేసింది.

Also Read : Pawan Kalyan : మా జోలికి వ‌స్తే ఊరుకోను – ప‌వ‌న్

 

Leave A Reply

Your Email Id will not be published!