Eva B Rapper : ఎవరీ ఎవా బి అనుకుంటున్నారా. పాకిస్తాన్ లో మోస్ట్ పాపులర్ రాపర్ గా పేరొందిన గాయకురాలు. రచయిత్రి కూడా. అమెరికన్ రాపర్లుగా పేరొందిన ఎమినెమ్ , క్వీన్ లతీఫాల నుంచి ఎవా బి (Eva B Rapper )ప్రేరణ పొందారు.
ఆమె తన పడక గదినే తన క్రియేటివిటికి కేరాఫ్ గా మార్చుకుంది.
అక్కడి నుంచే సాహిత్యాన్ని రాయడం ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా తన ర్యాప్ లను పోస్ట్ చేస్తూ వచ్చింది.
ప్రధానంగా ఫేస్ బుక్ లో ఎవా బి పోస్టులకు మంచి ఆదరణ లభించింది. రాను రాను ఫాలోయింగ్ మరింత పెరిగింది.
పూర్తి సంప్రదాయ బద్దంగా ఉండే పాకిస్తాన్ లో మహిళలు బయటకు రావడం అంటే యుద్దం చేయడమే.
ఎవా బి గత కొంత కాలం నుంచి ఎవరి కంట పడకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతూ వస్తున్నారు.
కానీ రాపర్ పై తనకున్న ఉన్న ప్రేమను మాత్రం ఆమె చంపుకోలేక పోయింది.
ఆన్ లైన్ లో ఆమె మిలియన్ల కొద్దీ వీక్షణలను సంపాదించుకుంది.
కరాచీ పరిసరాల్లోని వీధుల్లో అప్పుడప్పుడు నడుస్తూ ఉంటుంది. ఒక రకంగా అందరికీ భయపడి అజ్ఞాతంలో ఉంది.
ఒక్కోసారి నా పాటలను వాళ్లు వింటూ ఆనందంలో మునిగి పోతారు. కానీ ఆ పాడింది నేనని వారికి తెలియదు.
ప్రజలు నన్ను గుర్తించక పోవడం , వారు నా పాటలను ప్లే చేయడం హాస్యాస్పదంగా ఉంది.
కానీ నేను వారి ముందు ఉన్నప్పుడు అది నేనని వారు గుర్తించ లేరు. తన కుటుంబానికి కోపం తెప్పిస్తాననే భయంతో
చదువు అనే నెపంతో తన పొరుగున ఉన్న ఇతర వర్దమాన కళాకారుల సాయంతో పూర్తి ట్రాక్ లను రికార్డ్ చేసేందుకు ఎవా బి సంగీత స్టూడియోలకు దొంగ చాటుగా వెళ్లేది.
కానీ అనుకున్నది సాధించింది. ఇవాళ పాకిస్తాన్ లో ఎవా బి అంటే ప్రతి ఒక్కరు గుర్తు పడతారు. కోకా కోలా అంతర్జాతీయ సంగీత ఫ్రాంచైజ్ కోక్ స్టూడియోస్ పాకిస్తాన్ లో అత్యంత ప్రజాదరణ టెలివిజన్ ప్రోగ్రామ్ లో ఒకటి.
ఈ ఏడాది ఎవా బిని పాడాల్సిందిగా ఆహ్వానం పలికింది. దీంతో ఆమె కీర్తి ప్రపంచ వ్యాప్తంగా తెలిసి పోయింది. కనా యారి మ్యూజిక్ వీడియోలో పాడింది. 16 మిలియన్లకు పైగా దీనిని చూశారు.
Also Read : ధోనీ నాయకత్వం దక్కేనా విజయం