Sanjay Raut : మహారాష్ట్రలో శివసేన, బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. తాజాగా శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు.
ఫడ్నవిస్ కు చట్టం అంటూ వేరే ఏదీ ఉండదన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతల వ్యవహారంపై మండిపడ్డారు. సంజయ్ రౌత్(Sanjay Raut) తీవ్రంగా విరుచుకు పడ్డారు.
కొంత మంది నేతలు తామేదో పైనుంచి ఊడి పడ్డామని అనుకుంటారని కానీ చట్టం ముందు అంతా సమానమేనని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొనసాగుతోంది.
కేంద్రంలోని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. ఇద్దరు మంత్రులపై ఈడీ ప్రయోగించింది. దీనిపై శివసేన సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.
తాజాగా మహారాష్ట్ర బీజేపీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయనకు నోటీసులు ఇచ్చారు.
ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తమ ముందు హాజరు కావాలని ఆదేశించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఈ నిర్ణయాన్ని, నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి చెందిన శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్(Sanjay Raut) తీవ్రంగా మండిపడ్డారు.
చట్టం ముందు అంతా ఒక్కటేనన్నారు. అది తెలుసు కోకుండా తానేదో గొప్ప అనుకుంటే కష్టమన్నారు. తాము ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉందన్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకు పోతుందన్నారు.
Also Read : ప్రజా పాలన అందిస్తం హామీలు నెరవేరుస్తం